Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Development of public schools to corporate schools


Development of public schools to corporate schools
  •  ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
  • 1,255 స్కూళ్లకు కొత్త సొబగులు
  • మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
  • నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక
  • కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి
  • రెండు,మూడేళ్లలో దశలవారీ పూర్తి
  • కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ
Development of public schools to corporate schools


ప్రభుత్వం పాఠశాలలకు తీపికబురు. వాటిలో మౌలిక వసతులకు కల్పనకు, అభివృద్ధికి రంగం సిద్ధమైంది. నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపికైన జిల్లాలోని మొత్తం 1255 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. రానున్న రెండేళ్లలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నివసతులు కల్పిస్తారు. ఇంజనీరింగ్‌ అధికారులు స్వయంగా అన్ని పాఠశాలలను సందర్శించి ఏఏ వసతులు అవసరమో గుర్తిస్తారు. ఆ వసతుల కల్పనకు ఎంత మొత్తం కావాల్సింది అంచనా వేస్తారు. అవసరమైన ప్రాజెక్టు వేదికలను తయారుచేసి పంపిస్తే ఆ నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. దీనికోసం జిల్లాలో విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 14న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ప్రారంభించనున్నారు.

జిల్లాలోని 1,255 పాఠశాలలకు రానున్న రెండు మూడు సంవత్సరాలలో దశ తిరగనుంది. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో ఈ 1,255 పాఠశాలలను ఎంపిక చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. వీటిలో ప్రాఽథమిక పాఠశాలలు గరిష్టంగా 831 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 234, ఉన్నత పాఠశాలలు 190 ఉన్నాయి. 16 మండలాల్లోని 372 పాఠశాలలు అభివృద్ధి కార్యక్రమాలను ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారా చేపడతారు. మిగిలిన 40 మండలాల్లోని 883 పాఠశాలల్లో సమగ్రశిక్ష ఇంజనీరింగ్‌ విభాగం ఆఽధ్వర్యంలో చేపడతారు.

ఏఏ వసతులు కల్పిస్తారు

పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి చేర్చేందుకు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను పాఠశాలల్లో కల్పిస్తారు. బడిబయట పిల్లలను బడికి రప్పించి పిల్లల అభ్యాసన స్థాయిలను అభివృద్ధి పరిచేందుకు పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా 9 వసతులపై దృష్టి కేంద్రీకరించారు. నిరంతర నీటి వసతితో మరుగుదొడ్లు, ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబులైట్లు, రక్షిత మంచినీటి సరఫరా, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్‌, ఆహ్లాదకరమైన అందమైన పాఠశాలలుగా గోడలకు పెయింటింగ్స్‌, పాఠశాల భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయడం, ఆకుపచ్చ సుద్దబోర్డులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు ఏర్పాటుచేస్తారు. ఈ వసతుల కల్పనకు సంబంధించిన నిర్మాణ పనులల్లో కాంట్రాక్టర్ల జోక్యం లేకుండా ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలే అన్ని నిర్మాణాలను చేపడతారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఈ పనులన్నింటినీ పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించింది

మండలాలవారీగా ఎంపికైన పాఠశాలలు

జిల్లాలో మండలాలవారీగా ఎంపికైన పాఠశాలలు యర్రగొండపాలెం మండలంలో 26, పెద్దారవీడు 23, అద్దంకి 33, చీరాల 23, మార్కాపురం 33, దర్శి 34, తాళ్ళూరు 19, వేటపాలెం, కంభం 16, పొదిలి 24, మద్దిపాడు 23, కనిగిరి 35, సంతనూతలపాడు 24, ఒంగోలు రూరల్‌ 16, కొత్తపట్నం 16, సింగరాయకొండ మండలంలో 14 పాఠశాలలను ఎంపికచేశారు. ఈ 16 మండలాల్లోని పాఠశాలల్లో చేపట్టే నిర్మాణాలను ఏపీఈడబ్య్లూఐడీసీ అధ్వర్యంలో చేపడతారు

పుల్లలచెరువు 19, త్రిపురాంతకం 27, సంతమాగులూరు 25, బల్లికురవ 24, మార్టూరు 19, యద్దనపూడి 12, పర్చూరు 24, ముండ్లమూరు 24, కురిచేడు 17, దొనకొండ 21, పెద్దదోర్నాల 20, అర్ధవీడు 17, తర్లుపాడు 18, కొనకనమిట్ల 30, చీమకుర్తి 29, చిన్నగంజాం 13, కొరిశపాడు 15, గిద్దలూరు 28, హనుమంతునిపాడు 26, బేస్తవారిపేట 22, మర్రిపూడి 23, కొండపి 20, టంగుటూరు 18, వెలిగండ్ల 24, కొమరోలు 44, సీఎస్‌పురం 26, పీసీపల్లి 2, పామూరు 29, పొన్నలూరు 27, వలేటివారిపాలెం 23, లింగసముద్రం 20, ఉలవపాడు 20, గుడ్లూరు 25, ఇంకొల్లు 13, కారంచేడు 12, నాగులుప్పలపాడు 24, జరుగుమల్లి 21, కందుకూరు 24, రాచర్ల 16, జె..పంగులూరు మండలంలో 24 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో నిర్మాణాలను ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్‌ విభాగంలో చేపడతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Development of public schools to corporate schools"

Post a comment