Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do not check account status online

బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక : ఆన్‌లైన్‌లో అకౌంట్ స్టేటస్ చెక్ చేశారా?

మీరు SBI ఖాతాదారులా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తుంటారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్ డేంజర్‌లో ఉన్నట్టే. సైబర్ నేరగాళ్లకు పుట్టినిల్లు అయిన ఆన్‌లైన్‌లో మీ ప్రతి మూవెంట్ గమనిస్తూనే ఉంటారు హ్యాకర్లు. ఏ క్షణమైనా మీ అకౌంట్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. సైబర్ నేరగాళ్లు విసిరే వలలో పడకుండా మీ అకౌంట్లను జాగ్రత్తగా ప్రొటక్ట్ చేసుకోవాలనే విషయం మరవద్దు. ఆన్ లైన్ బ్యాంకు అకౌంట్లపై అవగాహన లేమితో ఉన్న ఖాతాదారులనే ప్రధానంగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తుంటారు.
Do not check account status online

మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? మీ బ్యాంకు అకౌంట్ డియాక్టివేట్ అయినట్టుగా ఎవరైనా మీకు ఫోన్ చేశారా?
బ్యాంకు అధికారులమని, వెంటనే మీ బ్యాంకు అకౌంట్ యాక్టివేట్ చేసుకోకపోతే.. అందులోని డబ్బులు ఫ్రీజ్ అయిపోతాయని, ఎప్పటికి ఇక తిరిగి తీసుకోలేరంటూ ఫోన్ కాల్స్ వచ్చాయా? మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపిస్తున్నామని, ఆ లింక్ క్లిక్ చేసి మీ అకౌంట్ స్టేటస్ తెలుసుకోవచ్చునని చెబితే నమ్మకండి.

అదంతా అబద్దం. అదో డేంజరస్ లింక్. అందులో మాల్ వేర్ వైరస్ ఉంటుంది. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేశారంటే చాలు.. మీ బ్యాంకు అకౌంట్ హ్యాకర్ల కంట్రోల్లికి వెళ్లిపోతుంది. మీకు తెలియకుండానే మీ బ్యాంకు యూజర్ నేమ్, పాస్ వర్డ్ తెలుసుకుని డబ్బులు దొంగిలిస్తారు జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఎస్బీఐ.

మీకు బ్యాంకు అకౌంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే.. నేరుగా మీ సమీప బ్యాంకు బ్రాంచ్ కు మాత్రమే వెళ్లి తెలుసుకోవాలి. ఇటీవల బ్యాంకు ఖాతాదారుల మొబైల్ నెంబర్లకు ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయి. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఏ బ్యాంకు అధికారి తమ కస్టమర్లకు థర్డ్ పార్టీ సైట్లు, వెబ్ లింక్స్, SMS, ఈమెయిల్స్, లేదా ఫోన్ కాల్స్ చేసి.. వారి వ్యక్తిగత వివరాలు చెప్పమని అడగరు. ఇలాంటి మెసేజ్ లు లేదా ఫోన్ కాల్స్ వస్తే.. వెంటనే పోలీసులకు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం అందించండి.

బీఅలర్ట్.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి



  • ఎస్బీఐ బ్యాంకు అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే యాక్సస్ చేసుకోండి.
  • మీ బ్యాంకు అకౌంట్ వ్యక్తిగత వివరాలను ఇతర వెబ్ సైట్లలో యాక్సస్ చేయొద్దు.
  • ఆన్ లైన్ లో బ్యాంకు వెబ్ సైట్ పూర్తిగా URL టైప్ చేసి సెర్చ్ చేయండి.
  • అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదు.
  • బ్రౌజర్ ఏదైనా సరే.. అడ్రస్ బార్ లో బ్యాంకు వెబ్ సైట్ URL టైప్ చేయండి.
  • కాపీ చేసినా లింక్ ల ద్వారా బ్రౌజర్లలో ఓపెన్ చేయకండి.
  • ఈమెయిల్స్ లేదా SMS, బ్యాంకు వెబ్ సైట్ల లింకుల మాదిరిగా కనిపిస్తే క్లిక్ చేయొద్దు.
  • అనుమానిత లింక్స్ క్లిక్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లను హ్యాక్ చేస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do not check account status online"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0