Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Does your vehicle have a fast tag? Buy Easy

FASTag : మీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ ఉందా ? ఈజీగా కొనండి ఇలా.
Does your vehicle have a fast tag? Buy Easy

జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేసేందుకు డిసెంబర్ 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం . 
టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఇక ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే . లేకపోతే రెండింతలు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది . దీంతో ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అమ్మకాలకు డిమాండ్ పెరిగిపోయింది . ఫాస్ట్ ట్యాగను ఎక్కడైనా కొనొచ్చు .

 వేర్వేరు బ్యాంకులు , నేషనల్ హైవే టోల్ ప్లాజాలు , ఆర్టీఓలు , కామన్ సర్వీస్ సెంటర్లు , ట్రాన్స్పర్ట్ హబ్స్ , బ్యాంక్ బ్రాండ్లు , ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు , వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు . 
ఎస్ బీఐ , హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ , | యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , పేటీఎం పేమెంట్ బ్యాంక్ , అమెజాన్లో కూడా మీకు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు . 12 , 000 పైగా బ్యాంక్ బ్రాండ్లు , 28 , 500 పాయింట్ ఆఫ్ సేల్ లొకేషన్స్ దగ్గర ఫాస్ట్ ట్యా గ్లు అందుబాటులో ఉంటాయి . 
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఫాస్ట్ ట్యా గ్లు అమ్ముతోంది . ఎస్ బీఐ పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గర ఫాస్ట్ ట్యా గ్ తీసుకోవచ్చు . కస్టమర్లు రెండు రకాలుగా అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు .
అందులో ఒకటి లిమిటెడ్ కేవైసీ హోల్డర్ అకౌంట్ . ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు . ఈ ఫాస్ట్ ట్యాగ్ ప్రీపెయిడ్ అకౌంట్‌లో రూ . 10 , 000 కన్నా ఎక్కువ ఉండకూడదు . నెలకు రూ . 10000 కన్నా ఎక్కువ రీలోడ్ చేయలేరు 

రెండోది ఫుల్ కేవైసీ హోల్డర్ అకౌంట్ . ఇది కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు . ఇందులో రూ . 1 , 00 , 000 వరకు లోడ్ చేసుకోవచ్చు . రీలోడు ఎలాంటి పరిమితి లేదు . కానీ . . . ఫాస్ట్ ట్యా గ్ అకౌంట్లో రూ . 1 , 00 , 000 కన్నా ఎక్కువ ఉండకూడదు . టోల్ ప్లాజా దగ్గర పేమెంట్ పూర్తి కాగానే కస్టమరక్కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది . 
కార్ , జీప్ , వ్యాన్ , టాటా ఏస్ , మినీ లైట్ కమర్షియల్ వెహికిలకు సెక్యూరిటీ అమౌంట్ రూ . 200 , మినిమమ్ బ్యా లెన్స్ రూ . 100 . 
లైట్ కమర్షియల్ వెహికిలక్కు సెక్యూరిటీ అమౌంట్ రూ . 300 , మినిమమ్ బ్యా లెన్స్ రూ . 140 . 
 3 యాక్సిల్ కమర్షియల్ వెహికిలకు సెక్యూరిటీ అమౌంట్ రూ . 400 , మినిమమ్ బ్యా లెన్స్ రూ . 300 . 
బస్ , ట్రక్ లాంటి వాహనాలకు సెక్యూరిటీ అమౌంట్ రూ . 400 , మినిమమ్ బ్యా లెన్స్ రూ . 300 . 
 4 నుంచి 6 యాక్సిల్ వాహనాలకు సెక్యూరిటీ అమౌంట్ రూ . 400 , మినిమమ్ బ్యా లెన్స్ రూ . 300 . 

7 కన్నా ఎక్కువ యాక్సిల్ వాహనాలకు సెక్యూరిటీ అమౌంట్ రూ . 400 , మినిమమ్ బ్యా లెన్స్ రూ . 300 . 
 హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీ , ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్కు సెక్యూరిటీ అమౌంట్ రూ . 400 , మినిమమ్ | బ్యా లెన్స్ రూ . 300 
మీరు ఎస్ బీఐ ఫాస్ట్ ట్యా గ్ కొనాలనుకుంటే పాయింట్ ఆఫ్ సేలకు వెళ్లాలి . లేదా టోల్ ప్లాజాల దగ్గర బ్యాంక్ ఆథరైజ్డ్ ఏజెన్సీలను సంప్రదించాలి . పీఓఎస్ లేదా ఏజెంట్ లొకేషన్ వివరాలను fastag . onlinesbi . com వెబ్సై ట్లో తెలుసుకోవచ్చు . 
ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు వాహనాన్ని కూడా తీసుకెళ్లాలి . ఆర్‌సీ కాపీ , ఐడీ ప్రూఫ్ , అడ్రస్ ప్రూఫ్ , ఫోటో ఉండాలి . ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ కు మూడేళ్ల గ్యారెంటీ ఉంటుంది . ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసేందుకు రూ . 200 నుంచి రూ . 400 వరకు వసూలు చేస్తుంది ఎస్ బీఐ .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Does your vehicle have a fast tag? Buy Easy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0