Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you have any doubts on Rythu Bharosa and P.M Kisan Sammen Nidhi. Spandana Program on 9 th .

రైతు భరోసా-పీఎం కిసాన్‌పై సందేహాలా?: 9వ తేదీన మీకోసం 'స్పందన'
If you have any doubts on Rythu Bharosa and P.M Kisan Sammen Nidhi. Spandana Program on 9 th .

 ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన (శనివారం) ప్రత్యేకంగా 'స్పందన' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. 9న మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో 'స్పందన' కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం అందాలని భావిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి విమర్శలు రాకుండా ఉండాలని ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. రైతులు, కౌలు రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారు.
అందుకే స్పందన
కొందరు రైతులకు రైతు భరోసా - పీఎం కిసాన్ స్కీం రావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆధార్ కార్డు కాపీలు సమర్పించకపోవడం, వెబ్ ల్యాండ్‌లో నెంబర్లు సరిగా లేకపోవడం, పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న బ్యాంకు ఖాతాలు ఆధార్ సీడింగ్ కాకపోవడం వంటి కారణాలతో అర్హులైన కొందరు రైతులకు ఈ పథకం వర్తింపచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు నవంబర్ 9వ తేదీన (శనివారం) స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మరికొన్ని లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

40 లక్షల మంది రైతులకు రూ.3,256 కోట్లు

రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం అక్టోబర్ 15వ తేదీన ప్రారంభించారు. దాదాపు ఇరవై రోజుల్లో 40 లక్షల మందికి పైగా రైతులు, కౌలురైతుల అకౌంట్లలో రూ.3,256 కోట్లకు పైగా జమ చేశారు. ఈ నెల 15వ తేదీలోగా దాదాపు మరో మూడు లక్షల మందికి రైతు భరోసా - పీఎం కిసాన్ పెట్టుబడి సాయం అందించనున్నారు.
డిసెంబర్ 15 వరకు గడువు
రబీ సీజన్ మొదలైంది. అదే సమయంలో రైతులు, కౌలురైతుల్లో అవగాహన పెరిగి ఇప్పుడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్నందున కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించే గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించాలని సీఎం ఆదేశించారు. సాధారణ రైతులకు నవంబర్ 15వ తేదీలోగా పెట్టుబడి సాయం అందించాలని సూచించారు. రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you have any doubts on Rythu Bharosa and P.M Kisan Sammen Nidhi. Spandana Program on 9 th . "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0