Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

అవిటివాడైనా ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు.

ఎస్​ఎస్​సీ సీజీఎల్​ ఆల్‌‌ ఇండియా టాపర్
Inspiration


అనుకోని విషాదం అతణ్ని అవిటివాణ్ని చేసింది.. అప్పటివరకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్​ కు ప్రిపేరైన అతని జీవితంలో అది ఊహించని మలుపు.. దేవుని గుడికి వెళ్లిన తనకు హైటెన్షన్ వైర్ తగిలి షాక్ కొట్టింది. అందులో నుంచి తేరుకునేలోపే కుడి చేయి తీసేశారు. అలాగని కుమిలిపోలేదు. ఎడమ చేతితో ఏ, బీ, సీ, డీలు రాయటం ప్రాక్టీస్‌‌ చేశాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ విభాగంలో ఆల్ ఇండియా లెవల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు 
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచికి చెందిన చిలకపాటి శ్రీను. తాను గెలిచింది పరీక్షలో కాదు.. జీవితంలో అంటూ గర్వంగా చెబుతున్న శ్రీను సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే..

కరెంట్ షాక్ తగిలి చేయి తీసేశాక ఇంట్లో రెండు నెలలున్నా. ఏం చేయాలో తెలీక మా ఇంట్లో ఉన్న గేదెలను మేపేందుకు పొలాలకు తీసుకెళ్లే వాణ్ని. ఒకరోజు ఇంటి పక్కన ఉండే ఒకామె తన కొడుకుకు నన్ను చూపిస్తూ  గాలికి తిరిగాడు కాబట్టే చేయి పోగొట్టుకుని ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు..  నువ్వు కూడా అలాగే తయారైతవా..   అంటూ నన్ను చూపిస్తూ తిట్టింది. అప్పుడు ఏడుపొచ్చింది. నేను ఇలాగే ఉండిపోవాలా.. చదువుకోవాలా అని రాత్రంతా ఆలోచన. పొద్దునే హైదరాబాద్‌‌కు వెళ్తున్నా అంటూ  ఇంటి నుంచి  వచ్చేసిన.

అంతకుముందు నేనున్న రూమ్‌‌కే తిరిగి వచ్చిన. పొద్దున్నే పెన్ను, రఫ్‌‌ బుక్ ముందేసుకొని ఎడమ చేతితో అక్షరాలు, నెంబర్లు రాయటం ప్రాక్టీస్​ చేసిన. బడి పిల్లాడిలా రోజూ అదే పని. తర్వాత లెక్కలు చేయడం.. ఇంగ్లీష్ పదాలు రాయడం నేర్చుకున్న. కొన్నిసార్లు తినడానికి, ఉండడానికి ఇబ్బందైనా మళ్లీ ఊరికి వెళ్లలేదు.  2016లో ఎస్‌‌ఎస్‌‌సీ సీజీఎల్ ఎగ్జామ్, రైల్వే ఎన్‌‌టీపీసీ ఎగ్జామ్‌‌లు రాసిన. సీజీఎల్‌‌లో టైర్‌‌‌‌–1, టైర్–2 క్వాలిఫై అయ్యాను.  చివరి టైర్‌‌‌‌–3 డిస్క్రిప్టివ్  ఎగ్జామ్​ పోయింది.

ఈసారి అస్సలు మిస్సవ్వకూడదని మళ్లీ ప్రాక్టీస్ చేసిన.  నన్ను నేను నిరూపించుకోవాలి దానికోసం చదువుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు, దానికోసం ఎంతైనా కష్టపడాలని ఫిక్సయి ప్రిపరేషన్ స్టైల్ మార్చి చదవడం మొదలుపెట్టిన. ఎస్‌‌ఎస్‌‌సీ ఎగ్జామ్‌‌లో మ్యాథ్స్, ఇంగ్లీష్ కీలకం. నాకున్న ప్రాబ్లమ్ నేను పేపర్‌‌‌‌పై పెన్ను పెట్టి తొందరగా చేయలేను. కొత్త కోణంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చా అని ట్రై చేసిన.  అలా మైండ్‌‌లోనే ఆలోచించి చిన్న, చిన్న స్టెప్పులు సాల్వ్ చేసి చివరకు ఆన్సర్ కోసం పేపర్, పెన్ను వాడేది. ఇంగ్లీష్ మాత్రం పేపర్ పైన బాగా రాసేది. డిస్క్రిప్టివ్ రాయడం కోసం  టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేసిన. పది నిమిషాల్లో ఎన్ని పదాలు రాయగలుగుతున్నా, ఎంత రాస్తున్నా అనేది చెక్ చేసుకుంటూ చదివిన.

చేయి లేని వారికి స్క్రైబ్‌‌ను పెట్టుకునే అవకాశమున్నా నేను పెట్టుకోలేదు. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది ఎవరిచేతనో రాయించడానికి కాదు అని నేనే సొంతంగా రాసిన.  చాలా కాన్ఫిడెంట్‌‌గా ఎస్సే రాసిన. ఫైనల్లీ.. నేను అనుకున్నట్లుగా ఇన్‌‌కమ్ టాక్స్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. కానీ ఆల్‌‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. నాకు వచ్చిన స్కోర్‌‌‌‌కు అసిస్టెంట్ ఆడిటింగ్ ఆఫీసర్(ఏఏఓ) గెజిటెడ్ జాబ్ వచ్చింది. కానీ ఇన్‌‌కమ్ టాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌లోకి వెళ్లాలన్న లక్ష్యంతో నాన్‌‌ గెజిటెడ్ అయినప్పటికీ అదే సెలెక్ట్ చేసుకున్న.

మార్కాపురంలో బీటెక్ చదివి కాంపిటీటివ్‌‌కు వచ్చిన.  ఎస్‌‌ఎస్‌‌సీ కంటే ముందే రైల్వేలో గూడ్స్ గార్డ్ జాబ్ వచ్చింది. ప్రస్తుతం వైజాగ్‌‌లో జాబ్​ చేస్తున్న. నాకు పదకొండు ఏళ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. అమ్మ రమణమ్మ పెంచింది. నన్ను మోటివేట్ చేసింది, నేను పడిపోతే హాస్పిటల్‌‌లో అంతా చూసుకుంది మా పిన్ని లక్ష్మి, బాబాయి వెంకటేశ్వర్లు. సర్జరీతో చేయి తీసేసినప్పుడు.. హాస్పిటల్‌‌లోనే  రెండుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్న. అప్పుడు ఫెయిలైన. కానీ.. అదే  లైఫ్​ టర్నయింది. ఇప్పుడు అనుకున్నది సాధించిన. – వెలుగు, హైదరాబాద్

ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కావచ్చు, కాంపిటీటివ్ అభ్యర్థులు కావచ్చు  ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే తప్ప కాంపిటీటివ్ పరీక్షల్లో సక్సెస్ కాలేరు.  ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించి వాటిని కరెక్ట్ చేసుకుంటే చాలు. మ్యాథ్స్ కోసం రాకేశ్ యాదవ్ బుక్స్, క్వాంటం క్యాట్ సర్వేష్ వర్మ పుస్తకాలు బెస్ట్. ఇంగ్లీష్ మాత్రం నీతుసింగ్ బుక్, అరిహంత్ పబ్లికేషన్స్‌‌కు చెందిన ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ పుస్తకం ప్రాక్టీస్ చేసిన.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0