Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IPhones for rent Apple sensational decision

ఇకపై అద్దెకు ఐఫోన్లు.. ఆపిల్ సంచలన నిర్ణయం!
 IPhones for rent    Apple sensational decision

ఐఫోన్.. చూడటానికి ఆకర్షిణీయంగా.. అద్భుతంగా ఉంటుంది. మధ్యతరగతి వ్యక్తులకు దూరంగా ఆకాశంలో ఉండే ఈ ఐఫోన్లను అందరూ కొనాలని అనుకుంటారు. బాగా డబ్బున్న వారు మాత్రమే కొనగలిగే ఈ ఐఫోన్లను అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆపిల్ సంస్థ సరికొత్త ప్రణాళికను రూపొందించింది. ఐ ఫోన్‌ను కొనాలనుకునే వారికి ఇకపై ఐఫోన్లను అద్దెకు ఇవ్వనుంది. మీరు వినేది నిజమండీ బాబు.. ప్రతి నెలా ఇంటి రెంట్ కట్టే విధంగా దీనికి కూడా అద్దె కట్టి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం అది వాడుకునే సమయంలో సరికొత్త మోడల్ ఏదైనా రిలీజ్ అయితే.. ఈ ఫోన్‌ను తిరిగి ఇచ్చేసి కొత్త ఐఫోన్‌ను తీసుకోవచ్చు. ఇదంతా నిజంగా నిజమవుతుందా అంటే.. అవునని అంటున్నారు ఆపిల్ సంస్థ అధికారులు.
త్వరలోనే ఐఫోన్లను అద్దెకు ఇచ్చే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక అద్దెకు తీసుకున్నవారు ఐక్లౌడ్, ఐట్యూన్స్ వంటి సర్వీసులను అదనంగా డబ్బులు చెల్లించి తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే ఈ కార్యక్రమం చేపడతామని సంస్థ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " IPhones for rent Apple sensational decision"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0