Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kishore vikasam

కిశోర వికాసం.
త్వరలో వినూత్న కార్యక్రమం..
బాలికల ప్రవేశాలు బాగున్న పాఠశాలలకు అవార్డులు...
మంచి నడతకు విద్యార్థులే మార్గ నిర్దేశకులు
త్వరలో వినూత్న కార్యక్రమం

పిల్లల్లో మంచి నడత , సాహజిక స్పృహ కలిగించడమే లక్ష్యంగా మహిళా శిశు సంక్షేమశాఖ , విద్యా శాఖ సంయుక్తంగా పాఠశాలల్లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాయి . కిశోర బాల వికాసం పేరుతో అమలు జరగ నున్న ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం బాలికా విద్యను ప్రోత్స హించడమే . ఇటీవలే ఈ బృహత్ కార్యక్రమానికి కార్యాచరణ ప్రణా ళిక రూపొందించారు . పరిసరాల పరిశుభ్రత , పచ్చదనం , వ్యక్తిగత
పరిశుభ్రత , బాల్య వివాహాల నిరోధం . . ఇలా 11 అంశాలపై 0 . ఉన్నత పాఠశాలల్లోని ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి . . ఆచ రించేలా చూస్తారు . ఆ క్రమంలో ప్రీ గ్రూప్ గానూ విద్యార్థులనే నియమిస్తారు .

రెండు రోజుల శిక్షణ

 పాఠశాలలో ప్రతి 25 మంది విద్యార్థులకు ఒకరిని ఓ గ్రూప్ సభ్యుడిగా ఎంపిక చేస్తారు . ఇలా జిల్లాలో 1400 మందిని ఎంపిక చేసి  వారికి రెండు రోజులపాటు 11 అంశాలపై శిక్షణ ఇస్తారు . ఇప్పటికే ఐసీడీఎస్ అధి కారులు శిక్షకులను ఎంపిక చేశారు . శిక్షణ పూర్తి చేసుకున్న వారు . . . ఆయా అంశాలపై సహచర విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తారు . ప్రస్తుతం విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది . ప్రోత్సాహమూ ఉంది . . . - ఈ ఏడాది ఐసీడీఎస్ చేపట్టిన మరో కార్యక్రమం బాలికా విద్యను ప్రోత్సహించడం . . పై తరగతులకు వెళ్లే సమయంలో బాలికల డ్రాపౌట్స్ అధికంగా ఉంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం - వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది . ఆ క్రమంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 20 మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ . 20 వేల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది . ఇందుకోసం నిరుపేద కుటుంబం నుంచి వచ్చి , ఇబ్బందులను అధి గమించి . . . చదువులో చక్కగా రాణించిన వారిని ఎంపిక చేసే బాధ్యతను డీఈవోకు అప్పగిం చింది . అదే విధంగా వై తరగతులకు వంద శాతం ఉత్తీర్ణత అయిన పాఠశాలలకు రూ . 20 వేల చొప్పున నగదు అందజేస్తారు . ఆ డబ్బును విద్యార్థుల అవసరాలకు పాఠశాలల్లో వినియో గించుకోవచ్చు . అయిదో తరగతి నుంచి ఆరో తరగతికి వంద శాతం ప్రవేశాలు జరిగిన అయిదు పాఠశాలలకు అవార్డు ఇస్తారు . 8 నుంచి 9వ తరగతికి , 9 నుంచి పదో తరగతికి వందశాతం విద్యార్థులు ప్రమోట్ అయిన అయిదు పాఠశాలలను ఎంపిక చేస్తారు . ఇలా మొత్తం 15 పాఠశాలలకు నగదు అవార్డులు అందజేస్తారు . దీనిపై డీఈవోను వీఎస్ సుబ్బారావును వివరణ కోరగా - ఐసీడీఎస్ అధికారులు కోరిన సమాచారాన్ని రెండు రోజుల్లో వారికి అందజే స్తామన్నారు . ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో నూతనోత్సాహం కలుగుతుందని చెప్పారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kishore vikasam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0