Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Like E-nomination in your PF account

ప్రాసెస్ ఇదిగో : మీ PF అకౌంట్‌లో E-nomination చేయండిలా?

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? మీ పీఎఫ్ అకౌంట్లో ఈ-నామినేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీ పీఎఫ్ అకౌంట్లలో కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని నామినీగా చేసుకోవచ్చు. జీతభత్యాలను పొందే ఉద్యోగులకో ఇదెంతో ప్రాధానమైనదిగా చెప్పవచ్చు.
Like E-nomination in your PF account

పీఎఫ్ క్లయిమ్ చేసుకునే సమయంలో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే నామినేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో PF నామినేషన్ ప్రాసెస్ ఎంతో ఈజీ కూడా. కేవలం 15 రోజుల్లో E-nomination ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఇందుకు సదరు ఉద్యోగి UAN యాక్టివేట్ అయి ఉండాలి. EPFO వెబ్ సైట్లో యూజర్ ( Online UAN Login ) లింకుపై Log on కావాల్సి ఉంది.
మీ పీఎఫ్ అకౌంట్లలోని నామినేషన్ ప్రక్రియలో ఆధార్ నెంబర్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు లేదా కొత్త ఈ-నామినేషన్ చేసుకోవచ్చు. పెళ్లికాని ఉద్యోగులు తమ నామినీలుగా కుటుంబ సభ్యుల్లో (తండ్రి/తల్లి) ఎంచుకోవచ్చు.

పెళ్లి తర్వాత పాత నామినేషన్ మార్చేసి.. భార్యాపిల్లలను నామినీలుగా చేర్చవచ్చు. ఈ ప్రక్రియ కోసం మీరు మీ కంపెనీ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. సొంతంగా మీరే అన్‌లైన్ పీఎఫ్ అకౌంట్ (UAN) ద్వారా నామినీలను యాడ్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. ఇందులోనే నామినీల పేర్లును కూడా చెక్ చేసుకోవచ్చు.

E-nominations ప్రక్రియ ఇలా :


  •  UAN నెంబర్ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్లో Log on చేయండి.
  • లాగిన్ కాగానే ఓ Pop-Up మెసేజ్ స్ర్కీన్ పై వస్తుంది.
  • E-nomination పేజీ లేదా Manage అనే ఆప్షన్ ఉంటుంది.
  • టాప్ ప్యానెల్ పై Manage బటన్ పై క్లిక్ చేయండి.
  •  e-nomination పై కూడా క్లిక్ చేయండి.
  • మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • బేసిక్ ఇన్ఫర్మేషన్ తో కూడిన ఫీల్డ్స్ ఉంటాయి.
  • ఇందులో కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఎడిట్ అవుతాయి.
  • ఈ-నామినేష్ వివరాలు ఎంటర్ చేసే ముందు ఓసారి చెక్ చేయండి.
  • Profile సెక్షన్లలోని ఈ ఫీల్డ్స్ పూర్తి చేసారో లేదో చెక్ చేయండి.
  • మీ ఫొటోను Upload చేయండి.
  • పర్మినెంట్, ప్రస్తుత చిరునామా కూడా ఇవ్వాలి.
  • మీ పెళ్లి అయిందా లేదా.. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
  • అంతా పూర్తి అయ్యాక.. నామినీ వివరాలు ఎంటర్ చేయండి.
  • నామినీ ఆధార్ నెంబర్
  • నామినీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ (లింగం)
  • నామినీ మీకు ఏమౌతారు (పీఎఫ్ ఖాతాదారుడికి)
  • నామినీ ఉండే చిరునామా, ఫొటో
  • నామినీల బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా ఇవ్వొచ్చు.
  • డిజిటల్ కెమెరాతో తీసిన ఫొటోగ్రాఫ్ Upload చేయాలి.
  • ఫొటో సైజు 3.5 cm x 4.5 cm ఉండాలి.
  • ఫొటోలో Face స్పష్టంగా ఉండాలి (80శాతం)
  • మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తో లింక్ అయిందో లేదో చెక్ చేయండి.
  • ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వివరాలు పూర్తిగా ఇచ్చారో లేదో చెక్ చేయండి. ఆ ఉద్యోగి.. నామినేషన్ పై డిజిటల్ సైన్ పెట్టాలి.
  • డిజిటల్ signing కోసం ఆన్ లైన్ nomination form తీసుకోవాలి.
  • ఆధార్ బేసిడ్ esign ప్రక్రియను OTP మెథడ్ ద్వారా పూర్తి చేయాలి.
  • అంతే.. ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినట్టే. 
  • మీ కుటుంబంలోని వారికి కూడా మీ పీఎఫ్ అకౌంట్లో నామినీలుగా అవకాశం లభించినట్టే.
  •  మీ తర్వాత మీ పీఎఫ్ ఖాతాపై వారికి కూడా అనుమతి ఇచ్చినవారువుతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Like E-nomination in your PF account"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0