Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Naadu-Nedu in Government Schools

ప్రభుత్వ బడులకు మహర్దశ
జిల్లాలో ‘నాడు-నేడు’ కింద తొలివిడతగా 1,381 పాఠశాలల ఎంపిక
పనుల నిర్వహణకు రూ.120 కోట్ల కేటాయింపు
Naadu-Nedu in Government Schools

ప్రభుత్వ బడులకు మహర్దశ
రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని బడులను అయిదేళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1,381 పాఠశాలలను తొలి విడతలో అభివృద్ధి చేసేలా కార్యాచరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లాకు రూ.120 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీరాజ్‌ శాఖ, సమగ్రశిక్షా అభియాన్‌ విభాగంలో పనిచేస్తున్న 64 మంది ఇంజినీర్లను అన్ని మండలాల పర్యవేక్షణకు నియమించారు. వీరు ప్రతి పాఠశాలలో జరిగే పనులను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల అభివృద్ధిలో వాటికి సంబంధించి యాజమాన్య కమిటీలే కీలకపాత్ర పోషించనున్నాయి. ఇందులో గుత్తేదారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. యాజమాన్య కమిటీల సభ్యులు సమావేశమై ఎలాంటి అవసరాలు ఉన్నాయి..? చేపట్టాల్సిన పనులు ఏమిటి..? అనే అంశాలపై చర్చించి సమష్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఈ పనులు జరిగేలా ఇంజినీర్లు పర్యవేక్షిస్తారు. పాఠశాలలను అభివృద్ధి చేయకముందు ఒక ఫొటో, పనులు పూర్తి చేసిన తరువాత మరో చిత్రాన్ని తీసి అక్కడే ప్రదర్శిస్తారు. జిల్లాలో తొలివిడతలో ఎంపిక చేసిన 1,381 పాఠశాలలను ఏడాదిలోపు అభివృద్ధి చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన విద్యా సహాయకులు వీరికి సహకారాన్ని అందిస్తారు. పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, ఫర్నిచర్‌ వసతి, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడతారు. అలాగే తాగునీటి సౌకర్యంతో పాటు నల్లబోర్డుల ఏర్పాటు, విద్యుత్తు సౌకర్యం కల్పించి ఫ్యాన్ల ఏర్పాటుకు చర్యలు చేపడతారు. గ్రాంథాలయాలను అభివృద్ధి చేస్తారు.ఈ సందర్భంగా సమగ్రశిక్షా అభియాన్‌ పీవో విజయభాస్కర్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలల్లో అనేక సమస్యలున్నాయని తెలిపారు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమం మంచి వేదిక అవుతుందన్నారు. పాఠశాలల్లో సమస్యలను ఇప్పటికే గుర్తించామని, వాటికి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Naadu-Nedu in Government Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0