Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Monthly Average Balance rules

SBI Monthly Average Balance rules మెట్రో , సెమీ - అర్బన్ , రూరల్    బ్రాంచ్‌లల్లో మంత్లీ,యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి . మంబ్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకుకు ఛార్జీలు చెల్లించాలి .
SBI Monthly Average Balance rules


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్‌ని మార్చింది. అన్ని అకౌంట్లకు 2019 నవంబర్ 1 నుంచి నిబంధనలు మారాయి. కస్టమర్లు తమ అకౌంట్లలో సరిగ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానాలు తప్పవు. మెట్రో, సెమీ-అర్బన్, రూరల్ బ్రాంచ్‌లల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకుకు ఛార్జీలు చెల్లించాలి. అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లో మీకు అకౌంట్ ఉంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3,000 మెయింటైన్ చేయాలి. ఇందులో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ చెల్లించాలి. బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.12+జీఎస్టీ చెల్లించాలి. 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.15+జీఎస్టీ చెల్లించాలి.
ఇలాగే సెమీ-అర్బన్, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లల్లో ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచ్‌లో అకౌంట్ ఉంటే రూ.2,000 మెయింటైన్ చేయాలి. ఇందులో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.7.5+జీఎస్టీ చెల్లించాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ చెల్లించాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.12+జీఎస్టీ చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లో అకౌంట్ ఉంటే రూ.1,000 మెయింటైన్ చేయాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.5+జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. బ్యాలెన్స్‌ 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.7.5+జీఎస్టీ చెల్లించాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ చెల్లించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Monthly Average Balance rules"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0