Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

State Cabinet meet today Discussion on various topics ..

  • నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ..
  •  వివిధ అంశాలపై చర్చ..
  •  ' వైఎస్ఆర్ నవశకం ' కొత్త మార్గదర్శకాలకు ఆమోదముద్ర 
  • సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డులు జగనన్న
State Cabinet meet today  Discussion on various topics ..

  •  విద్యా దీవెన , వసతి ప్రతిపాదనలకూ గ్రీన్ సిగ్నల్ ? 
  • టీటీడీ పాలక మండలి సభ్యుల పెంపు ఆర్డినెన్స్ స్థానే ముసాయిదా బిల్లు  సీఆర్‌డీఏలో ప్రాజెక్టుల స్థితిగతులపైనా చర్చ
  •  ' వైఎస్ఆర్ నవశకం ' పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత మందికి లబ్ది చేకూర్చేందుకు గాను కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది .
  •  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది . 
  • ఇందులో . . . . . - ' జగనన్న విద్యా దీవెన ' కింద ఐటీఐ విద్యార్థులకు రూ . 10వేలు , పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ . 15 వేలు చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనలకు , డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్ ఫీజుల కింద ఏటా రూ . 20వేల చొప్పున ఇచ్చే ' జగనన్న వసతి ' కి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు . 
  • + టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానే కేబినెట్ లో ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నారు . 
  • వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లులో సవరణలు చేయనున్నారు . 
  • + పీపీపీ ( పబ్లిక్ , ప్రైవేట్ , పార్టనర్‌షిప్ ) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది .
  •  + సీఆర్డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి . . వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశంఉంది . 
  • + వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది
  •  వివిధ సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డులు జారీచేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
  •  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ తెల్ల రేషన్‌ కార్డు ఆధారంగా మారింది. 
  • అందువల్ల సంపన్నశ్రేణి కూడా ఆ కార్డులు తీసుకుంటున్నారు. 
  • వీటి వల్ల రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల కంటే.. తెల్ల రేషన్‌ కార్డులు కలిగిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. 
  • ఈ నేపథ్యంలో తెల్ల కార్డుకూ.. ప్రభుత్వ పథకానికీ మధ్య లంకెను తెంపేందుకు.. ఒక్కో పథకానికి ఒక్కో కార్డును జారీ చేయాలని సీఎం నిర్ణయించారు. 
  • కేబినెట్‌ సమావేశంలో బియ్యం కార్డులు, పింఛను కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయడంపై మంత్రివర్గం సమీక్షిస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "State Cabinet meet today Discussion on various topics .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0