Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today's deadline for Child Info Update .. Three profiles to correct deficits

Today's deadline for Child Info Update .. Three profiles to correct deficits.
Today's deadline for Child Info Update .. Three profiles to correct deficits.

  • వేగంగా అమ్మఒడి ఆన్లైన్ సమాచారాని దువీకరించుకుంటారు.
  • చైల్డ్ ఇన్ఫో అప్డేట్ కు నేడే తుది గడువు 
  •  లోటుపాట్లను సరిదిద్దడానికి మూడు ప్రొఫార్మాలు -
  •  డిసెంబరు 20 నాటికి తుది జాబితాలు సిద్ధం 


 విద్యార్ధుల , తల్లులకు లబ్ధి చేకూర్చడానికి అమలుచేస్తున్న ' జగనన్న అమ్మఒడి ' ఆన్లైన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖాధికారులు వేగం పెంచారు . అర్హుల తుది జాబితాలను వచ్చే నెల 20వ తేదీకి సిద్ధం చేయాలని , ఆ కార్యకలాపాలను ఎలా పూర్తి చేయాలో ప్రభుత్వమే నిర్దేశిస్తూ సమయ పట్టికను కూడా సూచిస్తూ ప్రభుత్వం ఈ నెల 16న తాజా ఉత్తర్వులను జారీ చేసింది . రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు , ఎయిడెడ్ , ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు , జూనియర్ కళాశాలలు , ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని గురుకుల పాఠశాలలు , కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాల విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ . 15 వేలు చొప్పున అందజేయనున్నారు . 

చైల్డ్ ఇన్ఫో అప్ డేట్ ఇలా . . . . 

లబ్ధిదారుల ( విద్యార్థుల తల్లులు ) ఆధార్ నెంబర్లు , బ్యాంకు ఖాతా నెంబర్లు , ఐఎఫ్ఎస్సీ కోడ్ , రేషన్ కార్డుల వివరాలతో కూడిన దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించారు . వాటిని ఆన్లైన్లో చైల్ ఇన్ఫోలో అప్లోడ్ చేశారు . వీటిలో లోటుపాట్లుంటే సరిచేసుకుని తాజా డేటాను అప్డేట్ చేయాలి . ఈప్రక్రియను మంగళవారం సాయంత్రానికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది . ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను in ఏపీసీఎఫ్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా ప్రకటిస్తారు . ఈ ప్రక్రియను పూర్తిచేసి ఈనెల 21కి ప్రధానోపాధ్యాయులు , ప్రిన్సిపాళ్లకు ' లాగ్ ఇన్ ఐడీ , పాస్ వర్డ్ అందజేస్తారు . 

లోపాలను ఇలా సరిదిద్దుతారు

 ' అమ్మఒడి ' పథకానికి దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి రేషన్ కార్డులు , ఆధార్ నెంబర్లు , బ్యాంకు ఖాతాల్లో ఏదో ఒకటి లేకపోవడం0తో లబ్ది పొందలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి . వీటిని సరిచేయడానికి ప్రభుత్వం మూడు ప్రొఫార్మాలను నిర్దేశించింది . తెల్ల రేషన్ కార్డున్న తల్లుల వివరాలతో మొదటి ప్రొఫార్మా , కార్డు లేని తల్లుల వివరాలతో రెండో ప్రొఫార్మా , ఆధార్ నెంబరు , ఆధార్ ఎన్రోల్మెంటు నెంబరు లేని విద్యార్థుల వివరాలను సేకరించేందుకు మూడో ప్రొఫార్మా ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉంటాయి . వీటి ద్వారా లబ్దిదారుల డేటా ( ప్రీ పాపులేటెడ్ డేటా ) లోని సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు మరోసారి ధ్రువీకరించుకుని లోపాలుంటే సరిదిద్దుకోవాలి . ఆ జాబితాలను గ్రామ / వార్డు సచివాలయాల్లోని విద్య , సంక్షేమ సహాయకులు లాగిన్ కావడానికి ఈ నెల 24న పంపిస్తారు . రెండు , మూడో ప్రొఫార్మాల ద్వారా వచ్చిన సమాచారాన్ని గ్రామ వలంటీర్లకు అందజేస్తారు . వారుసమాచారాన్ని ధ్రువీకరించుకుంటారు . ఈ ప్రక్రియ 25 నుంచి డిసెంబరు ఒకటో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది . ఈ సమాచారాన్ని డిసెంబర్ ఐదో తేదీకి ' ఏపీసీఎఫ్ఎస్ఎస్ ' లో అప్ డేట్ చేయాలి .

 విద్యార్థుల హాజరు నమోదు

 లబ్దిదారుల ముసాయిదా జాబితాలను సిద్ధం చేసేటప్పుడు ప్రధానోపాధ్యాయులు . . విద్యార్థులకు పాఠశాల పని దినాల్లో 75 శాతం హాజరు ఉన్నదీ లేనిదీ పరిశీలించి . . ఆ వివరాలను జత చేస్తారు . అభ్యంతరాలను సరి చేసి వచ్చే నెల 23న డీఈవోకు అందిస్తారు . ఆ జాబితాలను 24న కలెక్టర్‌కు అందజేస్తారు . ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదంతో ' అర్హులైన తల్లులందరి ఖాతాల్లో రూ . 15 వేలు చొప్పున నగదు జమవుతుంది . పక్కాగా ఆన్లైన్ ఆన్లైన్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తున్నాం . పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు కూడా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది . పొరపాట్లు దొర్లకుండా పర్యవేక్షించేందుకు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం . ఎవరైనా విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడి వివరాలు సేకరిస్తారు . మధ్యలో బడి మానేసిన విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరదు . - చంద్రకళ , డీవైఈవో , విజయవాడ



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today's deadline for Child Info Update .. Three profiles to correct deficits"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0