Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Training for Teachers in the British Council Mathematics teaching in partnership with the University of Chicago

బ్రిటీష్ కౌన్సిల్ లో టీచర్లకు శిక్షణ 
చికాగో యూనివర్సిటీ భాగస్వామ్యంతో గణిత బోధన 
సింగపూర్ సహకారంతో ఉత్తమ విద్యా విధానాలు 
పాఠశాల విద్యపై సీఎం సమీక్ష
Training for Teachers in the British Council  Mathematics teaching in partnership with the University of Chicago

 పాఠశాల విద్యలో నూతన అధ్యాయాన్ని లిఖించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది . వివిధ అంతర్జాతీయ సంస్థల భాగ స్వామ్యంతో విద్యలో ఉత్తమ విధానాలను తీసుకురావాలని సంకల్పించింది . ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు . ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దు లకు గతంలో ప్రకటించిన దానికన్నా అదనంగా స్కూల్ బ్యాగ్ , నోట్ బుక్స్ , యూనిఫాం , కిట్లు అందజేయాలని నిర్ణయించారు . పాఠశాలలు తెరిచే నాటికే 3 జతల యూనిఫామ్స్ , జత షూస్ , సాక్సులు , టెక్స్ట్ బుక్స్ అందజేయాలని ఆదేశించారు . యూనిఫామ్స్ కుట్టించుకునేందుకు నేరుగా నగదు , , షూస్ , సాక్సుల కొనుగోలు కోసం విద్యాశాఖకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు . విద్యార్థులకు అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందిచనున్నారు . వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని నిర్ణయించడంతో కొత్త పాఠ్య ప్రణాళికను తయారు చేయడంపై సీఎం చర్చిం చారు . ఇందుకోసం పిల్లలను సన్నద్ధం చేసేందుకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు అందుకు సంబంధించి విద్యా సంవత్సరం మొదలైన మొదటి నెలరోజుల్లో బ్రిడ్జి కోర్సులు చేపట్టాలనే ప్రతిపాదనలను సీఎంకు వివరించారు . టీచర్లకు శిక్షణ ,

అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో . 

పటిష్టమైన పాఠ్యప్రణాళికను అమలు చేసేందుకు అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉత్తమ ప్రమాణాలు తీసుకువచ్చేలా పనిచేయా లని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ సూచించారు . గణితాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు చికాగో యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామవుతుందని వివరించారు . ఉపాధ్యాయులకు శిక్షణ , ఆంగ్ల మాధ్యమంలో బోధన తదితర అంశాల్లో బ్రిటిష్ కౌన్సిల్ కలిసి పనిచేస్తుందన్నారు . ఉత్తమ ఫలితాలనిచ్చే విద్యా విధానాలు , విద్యా వ్యవస్థలపై సింగపూర్ ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా అధికారు లు చెప్పారు . విద్యావ్యవస్థల్లో తీసుకొస్తున్న మార్పు లతో దేశమంతా ఏపీవైపు చూస్తోందని సీఎం అన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Training for Teachers in the British Council Mathematics teaching in partnership with the University of Chicago"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0