CPS cancels ..
సీపీఎస్ రద్దు చేసి తీరుతాం..
మార్చిలో కమిటీ నివేదిక వస్తుంది..
ఆర్ధికమంత్రిబుగ్గన రాజేంద్రనాధ్ వెల్లడి..
మార్చిలో కమిటీ నివేదిక వస్తుంది..
ఆర్ధికమంత్రిబుగ్గన రాజేంద్రనాధ్ వెల్లడి..
శాసన మండలి . . . సమావేశాల్లో నాలుగో రోజైన గురువారం సీపీఎస్ రద్దు అంశంపై వాదోపవాదాలు నడిచాయి . వైసీపీ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు అంశాన్ని పెట్టడంతో పాటు పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎసన్ను రద్దు చేస్తామన్న హామీ ఏమైందని టీడీపీ , పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించారు . సీపీఎస్ రుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని , మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టినా . . కాలపరిమితి ఏమీ పేర్కొనలేదని మంత్రి వివరిం చారు . సీపీఎస్ పై ఆగస్టు 1న మంత్రుల కమిటీని నియమించామని , ప్రతి నెలా ఒక సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పారు . అలాగే గతంలో మాజీ సీఎస్ టక్కర్ నేతృత్వంలో నియమించిన కమిటీ నివేదికపై ప్రస్తుత సీఎస్ ఆధ్వర్యంలో నియమించిన అడ్వెజరీ కమిటీ పరిశీలిస్తోందని వివరించారు . ఈ కమిటీ డిసెంబర్ 16న సమావేశం కానుందని చెప్పారు . ప్రభుత్వంపై ఉద్యోగుల ఒత్తిడి నేపథ్యంలో ఈ కమిటీ కాలపరిమితిని మే నుంచి మార్చికి కుదిస్తూ జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు . మంత్రి ఇచ్చిన సమాధానంపై టీడీపీ , పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది . అనంతరం ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీపీఎస్ - అంశాన్ని రాజకీయంగా చూడొద్దని , మేం ఇప్పటికే లక్షల మందితో అనేక సార్లు ఆందోళనలు నిర్వహిం చామని పేర్కొన్నారు . అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రభుత్వ విభాగాల్లో ఎంత మంది పనిచేస్తున్నారో లెక్క తెలియదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు . ఈ లెక్కలు తీసేందుకు అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు నివేదికలు రూపొందిస్తున్నారన్నారు . ఈ ఉద్యోగుల క్రమబద్దీ కరణ డిమాండ్ పై మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు . అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ఉద్యోగా ల్లోనూ ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ , మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ది తో ఉందన్నారు . అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్యలో ఏజెన్సీలు లేకుండా ఉండేందుకు కార్పొరేష న్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు . ఈ సందర్భంగా ప్రశ్న అడిగిన ఎమ్మెల్సీ విఠపు బాలసు బ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో రెండున్నర లక్షలకు పైబడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని , వారందరితో పాటు కేంద్ర , రాష్ట్ర ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులనూ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని , వారికి పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు .
0 Response to "CPS cancels .."
Post a Comment