Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Digital services for students!

విద్యార్థులకు డిజిటల్‌ సేవలు!


నాగమల్లిక వల్లూరి... స్టార్టప్‌ రంగంలో మరో యంగ్‌ తరంగ్‌. ‘స్కేల్‌ అప్‌ కన్సల్టెంట్స్‌’ సంస్థ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో డిజిటల్‌ సదుపాయాలను అందిస్తున్నారు. పాఠశాలలకు అందుబాటులో ఉండేలా తన బృందంతో కలిసి ఇటీవల ఆమె ఒక ప్రాజెక్ట్‌ రూపకల్పన చేశారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
Digital services for students!

‘‘నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)లో ఇంజనీరింగ్‌ (2009) చేశా. అక్కడ చదువుతున్నప్పుడే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో హైదరాబాద్‌లోని ‘కంప్యూటర్‌ సైన్స్‌ కార్పొరేషన్‌’లో సీనియర్‌ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం వచ్చింది. అందులో ఐదేళ్లు పనిచేశా.

సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వైపు...

నాకు బిజినెస్‌పై ఆసక్తి ఎక్కువ.. సామాజిక ఔత్సాహిక పారిశ్రామికవేత్త (సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌) అవాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో నేను సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగం మానేశాను. 2014లో హైదరాబాద్‌లో ‘ఇన్ఫోసిస్‌’ అందిస్తున్న నిధులతో నడుస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మేనేజ్‌మెంట్‌’ (సిఎస్‌ఐఎం) సంస్థలో సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించిన కోర్సు చేశా. ఆ తర్వాత నా సొంత ప్రాజెక్టులు ఆపకుండా చేస్తూ వచ్చా. తర్వాత ‘సోషల్‌ ఇంపాక్ట్‌ స్ట్రాటజీస్‌ స్పెషలైజేషన్‌’ కోర్సును అమెరికా ‘యుపెన్‌’ (యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా)లో చేశా. నాకు బోధన పట్ల కూడా ఆసక్తి ఉంది. అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి పాఠశాలలకు వెళ్లి వారి విద్యావిధానం గురించి తెలుసుకున్నా. సింగపూర్‌ విద్యా వ్యవస్థను కూడా స్టడీ చేశా. భారతదేశ విద్యా వ్యవస్థకు, అమెరికాలోని విద్యా వ్యవస్థకు చాలా తేడాలున్నాయి. అందుకే ఈ రంగంలో సామాజిక వ్యాపారం (సోషల్‌ బిజినెస్‌) చేయడానికి మనదేశంలో అవకాశాలు బాగా ఉన్నాయనిపించింది.

డిజిటల్‌ విద్య వైపు...

అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన విద్యావ్యవస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా దూసుకుపోతున్నాయి. నేడు తోటి పిల్లలతో కాకుండా రోబోట్స్‌తో పోటీపడాల్సిన పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. అందుకే కొత్తతరం పిల్లలకు కొత్తరకమైన విద్యా విధానం కావాలి. దానికి అనుగుణమైన విధానాలు, బోధనాశైలి ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండాలి. విద్యాబోధనలో డిజిటలైజేషన్‌ చేపట్టాలి. మన దగ్గర గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం కంప్యూటర్లను పెట్టింది. టీచర్లు ప్రొజెక్టర్ల సాయంతో విద్యా బోధన చేస్తున్నారు. వీటిని నిర్మాణాత్మకంగా కొనసాగించడంలో ప్రభుత్వానికి మా టెక్నాలజీ తోడ్పడుతుందని మేము భావిస్తున్నాం. నేను చేస్తున్న ఈ వ్యాపారం నిర్మాణాత్మకమైన ప్రభావం చూపేలా, సామాన్యుల జీవితాలను మార్చేలా ఉండాలనుకున్నా. అలా ‘స్కేల్‌ అప్‌ కన్సల్టెంట్స్‌’ సొల్యూషన్స్‌ ప్రారంభించాం.

ఆల్‌ ఇన్‌ వన్‌ సొల్యూషన్‌..

మా ప్రాజెక్ట్‌లో రేడియస్‌ ఒక ప్లాట్‌ఫామ్‌. డిజిటలైజేషన్‌ సంస్కృతిని విస్తరించే దిశగా తక్కువ ఖర్చుతో కూడిన రెప్లికబుల్‌, స్కేలబుల్‌ డిజిటల్‌ సదుపాయాలు అందివ్వాలనుకున్నాం. మా దగ్గర రూపకల్పన చేసిన కంటెంట్‌ ఉంటుంది. ఆ కంటెంట్‌ను పిల్లలకు ప్రొజెక్ట్‌ చేస్తాం. అందులో 3డి వీడియోలు, ఇంటరాక్టివ్‌ త్రీడీలు, విఆర్‌ వీడియోలు... ఇలా చాలా రకాలుంటాయి. మా దగ్గర లెర్నింగ్‌ మేనేజింగ్‌ సిస్టమ్‌, కంటెంట్‌కు సంబంధించి ప్రోగ్రామ్స్‌ ఎన్నో ఉన్నాయి. సెంట్రల్‌ సర్వర్‌, క్లాస్‌రూమ్‌ కంప్యూటర్స్‌, ప్రొజెక్టర్లు, టచ్‌బోర్డులను అనుసంధానం చేసి దాన్ని ఒక ఉత్పత్తి (ప్రొడక్టు)గా రూపొందించాం. ఇదంతా మా సొంత సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి అందిస్తున్నాం. మా ఇంజనీర్ల బృందం దీన్ని రూపకల్పన చేసింది. తెలంగాణ వి-హబ్‌ మమ్మల్ని ప్రోత్సహించింది.

పిల్లల్లో డిజిటల్‌ పరిజ్ఞానం అభివృద్ధి.

పిల్లల్లో డిజిటల్‌ పరిజ్ఞానం అభివృద్ధి చెందడానికి రేడియస్‌ సొల్యూషన్‌ ప్రొడక్టు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అన్ని స్కూళ్లను డిజటల్‌ సామర్థ్యం ఉన్నవాటిగా చేయొచ్చు. మా ప్రొడక్టు ఒక తరగతికే పరిమితం కాకుండా ఏకకాలంలో పలుతరగతుల్లో బోధన సాగించేలా సహాయపడుతుంది. స్కూలు మొత్తం వైఫై జోన్‌గా, అన్ని తరగతి గదుల్లోనూ ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే, డిజిటల్‌ స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌, కమ్యూనికేషన్‌లతో పాటు ఎలాంటి బోధనా విధాన్నైనా చేపట్టేలా ఉంటాయి. ప్రెజెంటేషన్‌ విధానం కూడా వాటిల్లో ఉంటుంది. మాకు ప్రాజెక్టు డిజైన్‌ బృందం ఉంది. ఎలాంటి ప్యాకేజీ కావాలంటే అలా డిజిటల్‌ ప్రొడెక్టును వినియోగదారులకు అందిస్తాం. కొత్త కంటెంట్‌ను అనుసంధానించడం, పునరుద్ధరించడం, అలాగే కొత్త పరికరాల తయారీ, ఇన్‌స్టలేషన్‌ యాక్సెస్‌ వంటి సేవలు కూడా అందిస్తాం.

పైలెట్‌ ప్రాజక్టుగా...

పైలెట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని ఐదు పాఠశాలల్ని డిజిటలైజ్‌ చేయాలనుకున్నాం. ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక పబ్లిక్‌ ఫండింగ్‌ స్కూల్‌, ఒక ప్రైవేటు స్కూలు, ఒక కాలేజీ, అలాగే ఒక శిక్షణా కేంద్రం ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. మా బృందంలో ముగ్గురు ఇంజనీర్లు, ఒక వీడియో కంటెంట్‌ డెవలపర్‌ ఉన్నారు. మా ఈ ప్రోగ్రామ్‌ని భవిష్యత్తులో విస్తృతంగా వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. విద్యకు సంబంధించి మాత్రమే కాకుండా మహిళా రక్షణ యాప్స్‌ తయారీ, ప్రయాణంలో భద్రతా సంబంధిత పరిష్కారాల యాప్‌ వంటి సేవలను కూడా అందిస్తాం. మా ప్రత్యేకత ఏమిటంటే... ఇప్పటిదాకా ఇంటరాక్టివ్‌ టచ్‌ బోర్డ్సు , ప్రొజెక్టర్లు, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌... ఇలా అన్నింటినీ మాలా ఒకటిగా అందించిన వాళ్లు లేరు.

ప్రతి విద్యార్థి కూడా చదువులో నూరు శాతం ప్రతిభ

ఈ పైలెట్‌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అన్ని స్కూళ్లకు నేరుగా వెళతాం. ఇతర రాష్ట్రాలలో కూడా మా డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సేవలను విస్తరించాలనే ఆలోచన ఉంది. ప్రతి విద్యార్థి కూడా చదువులో నూరు శాతం ప్రతిభ చూపాలంటే డిజిటలైజ్డ్‌ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అవసరం. ఈ పరిజ్ఞానం వారిని చైతన్యవంతుల్ని చేస్తుంది. పిల్లలు కూడా ఈ తరహా తరగతుల్లో ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. గ్లోబల్‌ స్థాయిలో ఉండే పోటీని ఎదుర్కొనేలా మన పిల్లల్ని తీర్చిదిద్దాలంటే వారిలో సాంకేతికపరమైన విజ్ఞాన బీజాలు నాటాలి. అప్పుడే వారి ఆలోచనలు క్రియేటివ్‌గా ఉంటాయి. అందుకోసమే మాఈ ప్రయత్నం’’

కొత్తతరం పిల్లలకు కొత్తరకమైన విద్యా విధానం కావాలి. విద్యాబోధనలో డిజిటలైజేషన్‌ చేపట్టాలి. మన దగ్గర గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం కంప్యూటర్లను పెట్టింది. టీచర్లు ప్రొజెక్టర్ల సాయంతో విద్యా బోధన చేస్తున్నారు. వీటిని నిర్మాణాత్మకంగా కొనసాగించడంలో ప్రభుత్వానికి మా టెక్నాలజీ తోడ్పడుతుందని మేము భావిస్తున్నాం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Digital services for students!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0