Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Forgot ATM PIN. . . Can be reset. . . Do this. . .

ఏటీఎం పిన్ మర్చిపోయారా . . . రీసెట్ చేసుకోవచ్చు . . . ఇలా చెయ్యండి . . . 

ATM PIN change : హ్యాకర్లు ఈజీగా పిన్లను గుర్తుపట్టేస్తున్నారు . అందువల్ల పిన్ కాస్త కష్టంగా ఉండాలి . ఒకే వరుస నంబర్లు కాకుండా సంబంధం లేని నంబర్లను పెట్టుకోవాలి .
ఈ రోజుల్లో డబ్బు కావాలంటే బ్యాంకుకి వెళ్లాల్సిన పనిలేదు. ఏటీఎం కియోస్క్‌కి వెళ్లి... ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేసుకోవచ్చు. మార్కెట్లలో వస్తువులు కొనుక్కోవాలన్నా ఏటీఎం కార్డుతో పని ఈజీ. ఇంత కీలకమైన కార్డు పిన్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్) మనకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. నాలుగు అంకెల ఆ నంబర్‌ను 1234 అనో, 6666, 2222 అనో తేలికైన కోడ్ పెట్టుకుంటే ప్రమాదమే. ఎందుకంటే హ్యాకర్లు ఇలాంటి పిన్‌లను ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అందువల్ల పిన్ కాస్త కష్టంగా ఉండాలి. అంటే 4522 అనో, 8944 అనో, 0028 అనో... ఇలా ఏమాత్రం సంబంధం లేని నంబర్లు పెట్టుకోవాలి. మొదట్లో వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టమైనా... ఏటీఎం కార్డ్ వాడుతూ ఉంటే పిన్ అదే గుర్తుంటుంది. గుర్తు ఉండదనుకుంటే, ఏ పేపర్ మీదో దాన్ని రాసిపెట్టుకోవడం మేలు.
ఒక్కోసారి పిన్ రాసుకోనివాళ్లు అది ఎంతో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు బ్యాంకుకి వెళ్లాల్సిన పనిలేదు. ఏటీఎం కియోస్క్‌కి వెళ్లి పిన్ రీసెట్ చేసుకోవచ్చు. అందుకోసం ఇలా చెయ్యండి.

పిన్ రీసెట్ చేయు విధానం


  •  ముందుగా ఏటీఎం యంత్రంలో మీ ఏటీఎం కార్డును పెట్టండి. తెలుగు లేదా ఇంగ్లీష్ ఆప్షన్ ఎంచుకోండి.
  • రకరకాల సేవలు కనిపిస్తాయి. వాటిలో బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • నెక్ట్స్ కొన్ని ఆప్షన్లు వస్తాయి. వాటిలో పిన్ జనరేట్ లేదా ఏటీఎమ్ పిన్ రీసెట్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆ యంత్రం మీ అకౌంట్ నంబర్ ఎంటర్ చెయ్యమని అడుగుతుంది. ఎంటర్ చెయ్యండి.
  •  తర్వాత అకౌంట్‌కి జతచేసిన ఫోన్ నంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
  •  ఆ ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చెయ్యండి.
  • అప్పుడు ఏటీఎం కార్డుకి పిన్... కొత్తగా ఎంటర్ చెయ్యమని అడుగుతుంది. మీరు నాలుగు అంకెలు ఎంటర్ చెయ్యగానే సక్సెస్ అని వస్తుంది.
  • సక్సెస్ అని వచ్చిన వెంటనే మీ ఏటీఎం కార్డుకి కొత్త పిన్ సెట్ అయిపోయినట్లే. దాన్ని గుర్తుంచుకొని... ఇకపై ఆ పిన్‌తో ఆపరేట్ చెయ్యవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Forgot ATM PIN. . . Can be reset. . . Do this. . ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0