Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

From one to sixth class ... Syllabus to be reduced in all subjects

తగ్గనున్న సిలబస్

From one to sixth class ... Syllabus to be reduced in all subjects

 ఒకటి నుంచి ఆరో తరగతి  వరకు...అన్ని సబ్జెక్టుల్లో తగ్గనున్న అధ్యాయాలు
 ఆంగ్ల మాధ్యమం అమలు కోసం చర్యలు
 ఎస్‌సీఈఆర్‌టీలో విద్యాశాఖ కసరత్తు


 ఒకటి నుంచి ఆరో తరగతి వరకు సిలబస్‌ తగ్గనుంది. ఆయా తరగతుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ అధ్యాయాలను కుదించబోతున్నారు. ప్రాథమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో జరగనుండటంతో పిల్లలపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో సిలబస్‌ రూపకల్పనపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎ్‌ససీఈఆర్‌టీ)లో దాదాపు 180మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా నిపుణులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సిలబ్‌సను తెప్పించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్‌కు వెళ్లిన టీచర్లు, నిపుణులతో కూడిన బృందం అక్కడి సిలబ్‌సపై అధ్యయనం చేసి, వాటన్నింటినీ క్రోడీకరించింది. రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీషు(బెంగళూరు), ఇఫ్లూ (హైదరాబాద్‌), పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఆంగ్ల మాధ్యమ నిపుణుల సూచనలు, సలహాలతో పాఠ్యాశాలను రూపకల్పన చేస్తున్నారు.


అమెరికా, యూకే, శ్రీలంక, చైనా, సింగపూర్‌ వంటి దేశాల నుంచి ప్రాథమిక విద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు తెప్పించుకుని అధ్యయనం చేయించారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్‌ కూడా పరిశీలించారు. రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ లనే అనుసరిస్తున్నట్లు తేలడంతో రాష్ట్రంలోనూ అదే విధానాన్ని పాటించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త సిలబస్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "From one to sixth class ... Syllabus to be reduced in all subjects"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0