Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If your State Bank of India-SBI debit card is using cards with magnetic stripes, you must immediately convert them to an EMV chip card

 మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- SBI డెబిట్ కార్డు  మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ ఉన్న కార్డులే ఉపయోగిస్తున్నట్టైతే వాటిని వెంటనే ఈఎంవీ చిప్ కార్డులోకి మార్చుకోవాలి.
If your State Bank of India-SBI debit card is using cards with magnetic stripes, you must immediately convert them to an EMV chip card


మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- SBI డెబిట్ కార్డు వాడుతున్నారా? మీరు ఇంకా పాత ఏటీఎం కార్డే వాడుతున్నారా? అయితే మీ పాత ఏటీఎం కార్డ్ త్వరలో పనిచేయకపోవచ్చు. అందరూ ఈఎంవీ చిప్ ఉన్న కార్డు మాత్రమే ఉపయోగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలాకాలంగా చెబుతోంది. 

కానీ... ఇప్పటికీ ఇంకా పాత కార్డులే అంటే ఈఎంవీ చిప్ లేని కార్డులే ఉపయోగిస్తున్న కస్టమర్లు ఉన్నారు. వారు కొత్త కార్డులు తీసుకోకపోతే పాత కార్డులు పనిచేయవు. మరి మీరు ఇప్పటికీ మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ ఉన్న కార్డులే ఉపయోగిస్తున్నట్టైతే వాటిని వెంటనే ఈఎంవీ చిప్ కార్డులోకి మార్చుకోవాలి. ఇందుకోసం మీకు డిసెంబర్ 31 వరకే అవకాశం ఉంది. మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఓసారి చెక్ చేసుకొని, కార్డుపై ఈఎంవీ చిప్ లేకపోతే కొత్త కార్డు కోసం అప్లై చేయాలి.
మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్ నుంచి ఈఎంవీ చిప్ కార్డుకు మారేందుకు మీరు ఎలాంటి ఫీజు, ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉచితంగానే కార్డులను అప్‌డేట్ చేస్తుంది. ఏటీఎం మోసాలు, సైబర్ చీటింగ్ అడ్డుకోవడానికి చిప్ ఉన్న కార్డులు ఉపయోగపడతాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్‌లైన్స్ ప్రకారం కస్టమర్లు అందరికీ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఈఎంవీ చిప్ కార్డులను జారీ చేస్తోంది ఎస్‌బీఐ. వాస్తవానికి డెడ్‌లైన్ గతంలోనే ముగిసింది. కానీ ఇప్పటికే చిప్ లేని కార్డులు ఉపయోగిస్తున్నవారికి వాటిని మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది ఎస్‌బీఐ. సో... మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుకు ఈఎంవీ చిప్ లేకపోతే డిసెంబర్ 31 లోగా మార్చుకోండి.
మీరు కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేయాలి. లేదా ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. e-Services సెక్షన్‌లో ATM Card Services ఓపెన్ చేయండి. Request ATM/Debit card పైన క్లిక్ చేయండి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఎలాంటి కార్డు కావాలో ఎంచుకోండి. నియమనిబంధనలు చదివి, వాటిని అంగీకరించి సబ్మిట్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు వారం రోజుల్లో కొత్త డెబిట్ కార్డ్ వస్తుంది.

State Bank of India
@TheOfficialSBI
Apply now to change your Magnetic Stripe Debit Cards to the more secure EMV Chip and PIN based SBI Debit card at your home branch by 31st December, 2019. Safeguard yourself with guaranteed authenticity, greater security for online payments and added security against fraud.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If your State Bank of India-SBI debit card is using cards with magnetic stripes, you must immediately convert them to an EMV chip card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0