Insurance on bank deposits of Rs. One Lakh RBI subsidiary DICGC Clarity
బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ. లక్ష వరకే: ఆర్బీఐ అనుబంధ సంస్థ డీఐసీజీసీ క్లారిటీ
న్యూఢిల్లీ: బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయినప్పుడు బ్యాంకు డిపాజిట్లపై ఖాతాదారులు రూ. లక్ష వరకే బీమా కవరేజీ పొందుతారని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా దాఖలైన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈ మేరకు స్పష్టం చేసింది.
డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయినప్పుడు, విఫలమైనప్పుడు ఖాతాదారులు డిపాజిట్లపై డీఐసీజీసీ రూ. లక్ష వరకు బీమా కవరేజీ అందిస్తుంది. పొదుపు, ఫిక్స్‌డ్, కరెంటు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లపై ఈ బీమా వర్తిస్తుందని డీఐసీజీసీ తెలిపింది.
ఈ బీమా కవరేజీ పెంపుపై ప్రతిపాదన ఏమైనా ఉందా? అనే అనే ప్రశ్నకు.. దానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చింది. కాగా, బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచేందుకు ప్రభుత్వం చట్టాలను తీసుకురానుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) సమాచార హక్కు చట్టం ద్వారా డీఐసీజీసీకి దరఖాస్తు చేసింది.
ఇందుకు డీఐసీజీసీ పైవిధంగా సమాధానం ఇచ్చింది. భారతదేశంలో కార్యకలాపాలు సాగించే అన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర దేశాల బ్యాంకుల శాఖలు, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు డీఐసీజీసీ పరిధిలోనే ఉంటాయి.
కాగా, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ఈ బీమా కవరేజీ విషయం ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో డీఐసీజీసీ చెప్పిన సమాధానం కొంత స్పష్టత ఇచ్చినట్లయింది. ఒక బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఖాతాదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే.. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డీఐసీజీసీ డిపాజిట్లకు నిర్దేశించిన గరిష్ట మొత్తం వరకు బీమా భద్రతను కల్పించడం జరుగుతోంది

0 Response to "Insurance on bank deposits of Rs. One Lakh RBI subsidiary DICGC Clarity"
Post a Comment