LIC Customer App: Policy to use the LIC Customer App
LIC Customer App : పాలసీ ఉంటే ఎల్ఐసీ కస్టమర్ యాప్ వాడుకోనే విధానం
LIC Customer App | ఆన్లైన్లోనే ప్రీమియం రెన్యువల్ , టాప్ అప్ , లోన్ రీపేమెంట్ , లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ , ఆన్లైన్ లోన్ రిక్వెస్ట్ లాంటి సేవల్ని పొందొచ్చు . ప్రీమియం క్యాలెండర్ , డాక్టర్ లొకేటర్ , రివైవల్ కొటేషన్స్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి . క్లెయిమ్ స్టేటస్ , లోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు .
LIC Customer App | ఆన్లైన్లోనే ప్రీమియం రెన్యువల్ , టాప్ అప్ , లోన్ రీపేమెంట్ , లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ , ఆన్లైన్ లోన్ రిక్వెస్ట్ లాంటి సేవల్ని పొందొచ్చు . ప్రీమియం క్యాలెండర్ , డాక్టర్ లొకేటర్ , రివైవల్ కొటేషన్స్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి . క్లెయిమ్ స్టేటస్ , లోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు .
యాప్ యొక్క ఉపయోగాలు
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... భారతదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లో కనీసం ఓ ఎల్ఐసీ పాలసీ ఉండటం సహజం. కోట్లాది మంది పాలసీదారులకు సేవల్ని అందిస్తోంది ఎల్ఐసీ. అయితే ఎల్ఐసీ పాలసీ ఉన్నవాళ్లు తమ పాలసీలకు సంబంధించిన వివరాల కోసం ప్రతీసారి ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లడం, ఏజెంట్‌కు ఫోన్ చేయడం అవసరం లేదు. కస్టమర్లకు సేవలు అందించేందుకు ఎల్ఐసీ ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. అదే 'ఎల్ఐసీ కస్టమర్' యాప్. మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే 'ఎల్ఐసీ కస్టమర్' యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కొన్ని సేవలు పొందొచ్చు. మీ ఎల్ఐసీ పాలసీలకు సంబంధించిన వివరాలు, కొత్త పాలసీల వివరాలు, ప్రీమియం క్యాలిక్యులేటర్, ఎల్ఐసీ ఆఫీస్ లొకేటర్ లాంటివన్నీ యాప్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనే ప్రీమియం రెన్యువల్, టాప్ అప్, లోన్ రీపేమెంట్, లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్, ఆన్లైన్ లోన్ రిక్వెస్ట్ లాంటి సేవల్ని పొందొచ్చు. ప్రీమియం క్యాలెండర్, డాక్టర్ లొకేటర్, రివైవల్ కొటేషన్స్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. క్లెయిమ్ స్టేటస్, లోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
యాప్ డౌన్లోడ్ చేసుకొనే విధానం
- ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో 'ఎల్ఐసీ కస్టమర్' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. పాలసీ నెంబర్, ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం ఎంటర్ చేయాలి.
- జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వెల్లడించాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడీతో లాగిన్ కావాలి.
- హోమ్ పేజీలో పాలసీలు యాడ్ చేసుకోవచ్చు.
- యాడ్ బటన్ క్లిక్ చేసి పాలసీ వివరాలు ఎంటర్ చేసి పాలసీలను యాడ్ చేయాల్సి ఉంటుంది.
- మీ పాలసీ మాత్రమే కాదు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల పాలసీలను కూడా మీ అకౌంట్లోనే యాడ్ చేసుకోవచ్చు.
- తల్లిదండ్రుల పాలసీలను, మేజర్ అయిన మీ పిల్లల పాలసీలను మీ అకౌంట్‌లో యాడ్ చేయలేరు.
- ఇందుకోసం వేరుగా అకౌంట్ రిజిస్టర్ చేయాలి.
- మీ పాలసీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే యాప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.
0 Response to "LIC Customer App: Policy to use the LIC Customer App"
Post a Comment