Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Narendra Modi's Good News For Farmers  Paying into their Accounts on January 2 ...

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ... వారి అకౌంట్స్ లోకి జనవరి 2న డబ్బులు...

దేశానికి రైతులే వెన్నుముక అనే సంగతి అందరికి తెలిసిందే. రైతులు పండించే పంట ఈ దేశానికీ ఆధారం. ఆరుగాలాలపాటు పొలంలో కష్టపడే దేశంలోని కోట్ల మంది దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ దేశంలో అందరికన్నా ఎక్కువగా కష్టపడేది రైతే... అందరికన్నా తక్కువ సంపాదించేది రైతే. మోసపోయేది... చివరకు ప్రాణాలు కోల్పోయేది కూడా రైతే. ఆ రైతులను ఆదుకోవాలని రాజకీయ నాయకులు చెప్తుంటారు తప్పించి వాళ్ళకోసం ఏమైనా చేస్తారా అంటే అస్సలు చేయరు.
అందుకే మోడీ వాళ్ళ కోసం తీసుకొచ్చిన పధకం ద్వారా వాళ్ళను ఆదుకోబోతున్నారు. ఇందుకోసం రూ.1200 కోట్లు వెచ్చించబోతున్నారు.
ఈ పధకం ద్వారా 2కోట్ల మంది రైతులు లబ్ది పొందబోతున్నారు. రెండు కోట్ల మంది రైతుల అకౌంట్స్ లోని జనవరి 2 వ తేదీన రూ.2000 వేయబోతున్నారు. ఇది సంతోషకరమైన విషయం అని చెప్పాలి. రైతులు తప్పకుండా ఈ దేశంలో గురించబడాలి.
వారు పండించిన పంటకు గురింపు రావాలి. రైతులు అంటా హాయిగా ఉండాలి అనే లక్ష్యంతో మోడీ ఈ పధకాన్ని తీసుకొచ్చారు. రైతుల అకౌంట్స్ లో జనవరి 2 వ తేదీన రూ. 2000 వేస్తున్నారు. ఆధార్ పాన్ లింక్ చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ పధకం వర్తిస్తుంది. ఈ పధకం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె, రైతులతో పాటుగా మిగతా వాళ్లకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి.
ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం కనిపిస్తున్నా, దాని ప్రభావం దేశంపై చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ను సామాన్యుల కోసం ప్రవేశపెట్టబోతున్నారు. సామాన్యులకు లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వం బడ్జెట్ లో అనేక పథకాలకు భారీ ఎత్తున బడ్జెట్ పెట్టబోతున్నది. గతంలో ఆర్టికల్ 370 అమలు ఉన్నది కాబట్టి అక్కడ రక్షణ కోసం భారీ బడ్జెట్ పెట్టింది. ఈసారి గతంలో కంటే కొంచం తక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Narendra Modi's Good News For Farmers  Paying into their Accounts on January 2 ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0