Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Next orders regarding Amma vodi.

Next orders regarding Amma vodi.
Next orders regarding Amma vodi.


💥 అమ్మఒడి తాజా మార్గదర్శకాలు సూచనలు... సబ్మిషన్లో  పైనల్ టైం షెడ్యూల్.. ,Rc.242, Dt. 20/12/20
పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి. నెం. 242/ఎ & ఐ/2019, తేది : 20.12.2019

     విషయం : 

పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.

నిర్దేశములు :

1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019
3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22.11.2019
4. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2.12.2019

ఆదేశములు

     'జగనన్న అమ్మఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2, 3 మరియు 4 లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
   తదుపరి కార్యక్రమాలు ఈ క్రింది విధంగా చేయాల్సిందిగా కోరడమైనది.
1)  22.12.2019 - ప్రొఫార్మా-1 మరియు ప్రొఫార్మా -2లను పూర్తి చేయుట.
2)  24.12.2019 - ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియెట్ విద్య వారి సమాచారాన్ని సంయుక్తం చేసి అర్హులైన ఒకే తల్లి/ సంరక్షకులను గుర్తించుట.
3) 26.12.2019 మరియు 27.12.2019 - సదరు పూర్తయిన సమాచారాన్ని గ్రామసభ/వార్డు సభ ద్వారా అనుమతి పొందుట.
4) 29.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారులకు పంపించుట.
5) 30.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖాధికారులకు
పంపుట.
6) 31.12.2019 - జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వారి అనుమతి కొరకు పంపుట.
7) 01.01.2020 - జిల్లా కలెక్టర్ వారి అనుమతి పొందిన పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారి కార్యాలయానికి పంపుట.
      ఈ అంశంపై సమగ్రమైన ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారు మరియు పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు 20.12.2019న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా తెలియజేయడమైనది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Next orders regarding Amma vodi."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0