Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No cell phone after 6 in the evening

సాయంత్రం 6 తర్వాత సెల్‌ఫోన్‌ వద్దు
No cell phone after 6 in the evening

ఆఫీసు సమస్యలు ఇంటిదాకా తేవద్దు
జీవనశైలి మార్పులతో పలు రోగాలు
'పల్మో అప్‌డేట్‌-2019' వర్క్‌షాప్‌లో వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ''సాయంత్రం ఆరు గంటల తరువాత సెల్‌ఫోన్‌ పక్కన పడేయండి.. ఆఫీసు విషయాలను ఆఫీసులోనే వదిలేసి ఇంటికి చేరండి.. నిద్రపోయేటప్పుడు నీలం రంగు వెలుగులు (స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ టీవీ స్ర్కీన్ల వెలుగులు) లేకుండా జాగ్రత్త పడండి'' అంటూ వైద్యులు ప్రజలకు సూచించారు. ఈ సూచనలను పాటించకపోతే జీవనశైలి జబ్బుల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు.
యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'పల్మో అప్‌డేట్‌-2019' వర్క్‌షాప్‌ సందర్భంగా శనివారం ఒక హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ జీఎ్‌సరావు, పల్మనాలజిస్టు డాక్టర్‌ నాగార్జున, సరావాక్‌ హాస్పిటల్‌ (మలేసియా) హెడ్‌ డాక్టర్‌ టై సీవ్‌ టెక్‌ ఈ సమావేశంలో మాట్లాడారు.

సెల్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీల కారణంగా చాలామంది అర్ధరాత్రి దాటాక కూడా నిద్రపోవట్లేదని.. ఇలాంటి అలవాట్ల వల్ల స్లీప్‌ అప్నియా (శ్వాసనాళాల్లో అడ్డంకుల వల్ల నిద్రా భంగం కలగడం), ఇన్‌సోమ్నియా (నిద్రలేమి) వంటి వాటి బారిన పడుతున్నారని అన్నారు. కాగా, వాయు కాలుష్యంతో ఆస్తమా, సీవోపీడీ, న్యూమోనియా, లంగ్‌ కేన్సర్‌ జబ్బులు నగరాల్లో విపరీతంగా పెరిగిపోయాయని యశోద చైర్మన్‌ జీఎ్‌సరావు ఆందోళన వ్యక్తం చేశారు. ధూమపానం వల్ల వచ్చే సీవోపీడీ జబ్బు ఇప్పుడు కాలుష్యం కారణంగా కూడా వస్తోందన్నారు. దేశ జనాభాలో పది శాతం మంది ఆస్తమా, సీవోపీడీతో.. 2.7 మిలియన్ల మంది పల్మనరీ క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్‌ నాగార్జున చెప్పారు. ఈ జబ్బులను నియంత్రించడానికి ఆధునిక పరికరాలతో, కొత్త వైద్యవిధానాలతో చికిత్సలు అందిస్తున్నామన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No cell phone after 6 in the evening"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0