Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prepare a list of qualified members in Ammavadi.

 వడివడిగా అమ్మఒడి..
అర్హుల జాబితా సిద్ధం..
 వలంటీర్ల ఇంటింటా సర్వే..
అర్హులందరికీ లబ్ది చేకూరేలా అధికారుల కసరత్తు..
Prepare a list of qualified members in Ammavadi.


 పిల్లలందరూ చదువు కోవాలనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి రూపకల్పన చేసిన ' జగనన్న అమ్మఒడి ' పథ కాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు . ఇందుకు సంబంధించి అర్హులైన విద్యార్థులను ఎం పిక చేసే జాబితాను సైతం సిద్ధం చేస్తున్నారు . ఇప్పటికే ఈ ప్రక్రియ దా దాపు కొలిక్కి వచ్చింది . వలంటీర్లు ఇంటింటి సర్వేను కూడా ప్రారంభిం చారు . అర్హులైన విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయలను అమ్మఒడి  పథకం కింద తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది . జిల్లాలో పరిస్థితి ఇలా . . విశాఖ జిల్లాలోని 5 , 400 పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 6 , 88 , 059 మంది విద్యార్థులు ఉన్నట్టు జిల్లా విద్యాశాఖ గుర్తించింది . వీరిలో 5 , 65 , 498 మందిని అమ్మఒడి పథకానికి అర్హులుగా అధికారులు తేల్చారు . అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తిం పజేస్తున్నారు . వీరి వివరాలు సైతం అధికారులు ఇప్పటికే సేకరించారు . జిల్లాలో ఒక లక్ష 10 వేల 336 మంది ఇంటర్ చదువుతున్న పిల్ల లు ఉండ గా . . 82 , 034 మందిని అమ్మఒడి పథకానికి అర్హులుగా తేల్చారు . వీరిలో మొదటి సంవత్సరం చదువుతున్న 58 , 402 మందిలో 44 , 602 మందిని , రెండో సంవత్సరం చదువుతున్న 51 , 934 మందిలో 37 , 432ని ఈ పథ కానికి అర్హులుగా గుర్తించారు . మిగిలిన వారు ఆధార్ కార్డు , తెలుపు రేషన్ కార్డు , బ్యాంకు అకౌంట్ నంబర్ , ఏ కళాశాలలో చదువుతున్నారు , తల్లి పేరు ఇవ్వవలసి ఉంది . 

నిబంధనల మేరకే విద్యార్థుల ఎంపిక 

అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే విద్యార్థుల ఎంపిక జరిగింది . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఈ పథకానికి ఎంపిక చేశాం . విద్యార్థులకు సంబంధించి సర్వే కూడా జరుగుతుంది . వివరాలు ఇవ్వని వారు ఉంటే ఇంటికి వచ్చే వలంటీర్ కి అందజేయాలి . 

 ఇంటర్ విద్యార్థులు అర్హులే 

ఇంటర్మీడియెట్ చదువుతూ . . తెలుపు రేషన్ కార్డు ఉన్న విద్యార్థులు కూడా అమ్మఒడి పథకానికి అర్హులే . ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులను ఎం పిక చేస్తున్నాం . ఇంకా వివరాలు ఇవ్వని వారు ఉంటే తక్షణమే నమోదు చేయించుకోవాలి . విద్యార్థులు తమ డేటా ఇచ్చి అమ్మఒడి పథకం నూరు శాతం విజయవంతం కావడానికి సహకరించాలి . - బి . సుజాత , ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prepare a list of qualified members in Ammavadi."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0