Super India: Follow India Google reference to America
సూపర్ ఇండియా: భారత్‌ను ఫాలో కండి.. అమెరికాకు గూగుల్ సూచన
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఇండియన్ గవర్నమెంట్ భారత్‌ను డిజిటల్ దిశగా మార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్మార్ట్ ఫోన్ ఆధారిత పేమెంట్ యాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని తీసుకు వచ్చింది. ప్రస్తుతం భారత్‌లోని ఆన్ లైన్ చెల్లింపుల విధానాల్లో ఇది బెస్ట్.
1.యూపీఐ
UPI ద్వారా భీమ్ యాప్ కావొచ్చు, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్స్‌తో పాటు సులభంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు కూడా. దీనికి కావాల్సింది ఓ బ్యాంకు అకౌంట్, ఆ అకౌంట్‌కు లింక్ అయి ఫోన్ నెంబర్ ఉండాలి.
ఇటీవలి కాలంలో ప్రజలు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి కంటే ప్రజలు UPIనే ఎక్కువగా ఆదరిస్తున్నారు.
2.భారత్‌లో UPI అద్భుత విజయం
అమెరికా ప్రభుత్వం కూడా ఫెడ్‌నౌ పేరుతో ఓ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గూగుల్ వినియోగదారుల వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్... అమెరికా సెంట్రల్ బ్యాంకుకు ఓ లేఖ రాశారు. భారత్‌లో అద్భుత విజయం సాధించిన UPIని ఆ లేఖలో ప్రస్తావించారు. UPI ఆధారంగా ఫెడ్‌నౌను అభివృద్ధి చేయొచ్చని సూచించారు. అన్ని కోణాల్లో చాలా జాగ్రత్తగా విశ్లేషించిన తరువాత భారత ప్రభుత్వం UPIని ప్రవేశపెట్టిందని, అందుకే ఇది భారత్‌లో పెద్ద విజయం సాధించిందని పేర్కొన్నారు.
3.UPI సూపర్
UPI విజయవంతం కావడానికి మూడు విశిష్టతలు తొడ్పడ్డాయని, ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు నేరుగా డబ్బులు ట్రాన్సుఫర్ చేయగలగడం ఇందులో మొదటిది అని, ఈ ట్రాన్సుఫర్ రియల్ టైమ్ అవడం మరో విశిష్టత అని పేర్కొన్నారు. దీంతో అప్పటికప్పుడే బదలీ చేయవచ్చునని పేర్కొన్నారు.
4.కస్టమర్లకు చేరువ కావొచ్చు
UPI ఆధారంగా టెక్ కంపెనీలు సునాయసంగా యాప్స్ తయారు చేసి కస్టమర్లకు చేరువ కావొచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా UPI ప్రత్యేకతల్ని వివరించారు. కాగా, ఇప్పటి వరకు అమెరికా విధానాలు చూసి భారత్ స్ఫూర్తి పొందిందని, ఇప్పుడు అదే భారత్ అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యపరిచేలా ఓ వ్యవస్థతో ముందుకు వచ్చిందని పలువురు ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒక్కటే కాదు బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలు కూడా యూపీఐపై ఆసక్తి కనబరుస్తున్నాయి.
0 Response to "Super India: Follow India Google reference to America"
Post a Comment