The deadline for uploading the details of Amma vodi beneficiaries online is an extension to this evening
*అమ్మఒడి లబ్ధిదారుల వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు గడువు నేటి సాయంత్రం వరకు పొడిగింపు..*
ప్రొఫార్మా-2 లో పెండింగులో ఉన్న లబ్ధిదారుల వివరాలను పరిశీలించి అప్ డేట్ చేయాలని ఆదేశం..*
*ఈరోజు సాయంత్రానికి అమ్మఒడి వెబ్ సైట్ క్లోజ్..*
*18న గ్రామ సభలు నిర్వహణ..*
*ఈరోజు సాయంత్రానికి అమ్మఒడి వెబ్ సైట్ క్లోజ్..*
*18న గ్రామ సభలు నిర్వహణ..*
జగనన్న అమ్మఒడి లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో ఆ లోడ్ చేసేందుకు గడువును సోమవారం సాయంత్రం వరకు ప్రభుత్వం పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి విఎస్ . సుబ్బారావు తెలిపారు . ప్రోఫార్మ 2లో పెండింగ్ లో ఉన్న లబ్దిదారుల వివరాలు అన్నింటిని పరిశీలించి అప్ డేట్ చేయాలని ఆదేశించారు . సోమవారం సాయం త్రానికి అమ్మఒడి వెబ్ సైట్ క్లోజ్ అవుతుందన్నారు . తక్షణం లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో ఆప్ లోడ్ చేసే ప్రక్రియను మండల విద్యాధికారులు వేగవంతం చేయాలని డీఈవో ఆదేశించారు . జిల్లాలలో మర్రిపూడి , ఒంగోలు మండలాలు వివరాలు నమోదులో బాగా వెనుకబడి ఉన్నాయన్నారు . తక్షణం ఎంఈవోలు బాధ్య తలు తీసుకోని గడువులోపు అప్లోడ్ చేయాలని సూ చించారు . అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించుకొని సత్వరమే పూర్తి చేయాలన్నారు . పట్టణ ప్రాం తాల్లో అవసరమైతే ఒక్కొక్క వార్డుకు ఇద్దరు టీచర్లు చొప్పున బాధ్యత అప్పగించి సకాలంలో పనిపూర్తయ్యేలా చూడాల న్నారు . మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి వారి సిబ్బంది సహకారం తీసుకోని ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు . ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ బెనిఫిట్ రాకుండా వారి రేషన్ కార్డులను క్షణ్ణంగా పరిశీలించామన్నారు . ప్రోఫార్మ2లోని లబ్ధిదారుల వివరాలను సోమవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఆప్ లోడ్ చేయాలని , 17న లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు . 17వ తేదీ జాబితాలను సోషల్ ఆడిట్ కు గ్రామ సచివాలయాల్లో అందజేయాలన్నారు . 18న గ్రామసభలు నిర్వహించి జాబితాలు ఆమోదం పొందేలా చూడాలని సుబ్బారావు కోరారు .
0 Response to "The deadline for uploading the details of Amma vodi beneficiaries online is an extension to this evening"
Post a Comment