Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The reasons for the capital change?

రాజధాని మార్పు కు కారణాలు ఇవే?
The reasons for the capital change?

 ఏపీలో మూడు రాజధానుల అంశం రగులుతోంది. అయితే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కీలక ఆలోచనలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. రెండు ప్రధాన అంశాలే రాజధాని మార్పుకు కారణమయ్యాయని తెలుస్తోంది. అమరావతిని పూర్తి చేస్తే రెండు ప్రమాదాలు తప్పవని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

అమరావతిని పూర్తి చేస్తే ఆ పేరు అంతా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్న అనుమానం సీఎం జగన్ లో ఉందట. ఎందుకంటే అమరావతిని రాజధానిగా నిర్మించి, పలు కార్యక్రమాలు చేసింది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మిగిలిన పనులు చేసి రాజధానిగా అమరావతిని పూర్తి చేసినా ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందన్న భావన వైసీపీలో ఉందని టాక్. ఒకవేళ అమరావతి పూర్తి చేసినా అనుకున్నంత పేరు రాకపోతే కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఇలా చేసే వాడు కాదేమో. సీఎంగా జగన్ అన్ ఫిట్ అన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుందేమోనన్న భయం కూడా వైసీపీ నేతల్లో ఉందని సమాచారం.

అమరావతిని పూర్తిగా వదిలేస్తే సీఎం జగన్ కు అమరావతిని అభివృద్ది చేయడం ఇష్టం లేదేమో అన్న పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవన్నీ ఆలోచించి ప్రమాదాల బారిన పడకుండా సీఎం జగన్ 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని చర్చ జరుగుతోంది. మరి కాసేపట్లో కేబినేట్ భేటి తర్వాత రాజధాని పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The reasons for the capital change?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0