Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To start posting for eligible candidates in DSC-2018

డీఎస్సీ-2018 లో అర్హత సాధించిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభం..
To start posting for eligible candidates in DSC-2018


జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు..
అర్హులందరికీ SMS ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు..

 డీఎస్సీ 2018లో అర్హత సాధించిన . . వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది . హైకోర్టు తీర్పు మేరకు 2 వేల 865 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది . దీంతో ఈ పోస్టులకు సంబం ధించి జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి . ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు జాబితాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు . 2018లో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 902 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే . డిసెంబర్ జనవరి నెలల్లో జరిగిన పరీక్షల్లో 5 లక్షల 5 వేల 547 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు . ఫిబ్రవరి 15న విడుదలైన ఫలితా ల్లో దాదాపు 4 లక్షల పైచిలుకుమంది అర్హత సాధించారు . ఈ మొత్తం పోస్టుల్లో జిల్లా పరిషత్ పాఠశాలల పరిధిలో 4 వేల 341 పోస్టులు , మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1100 పోస్టులు , ఆదర్శ పాఠశాలల కు సంబంధించి 909 పోస్టులు , గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు , రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175 , బీసీ సంక్షేమ పాఠ శాలల్లో 404 , పాఠశాల విద్యా శాఖ పరిధిలో 173 పోస్టులు ఉన్నాయి . వీటిలో పీజీ టీ , టీజీటీ పోస్టులకు సం బంధించి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది . ప్రొవిజనల్ జాబితాలో తిరస్క రణకు గురైన అభ్యర్థులకు బదులుగా . . మెరిట్ ఉన్న అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు . అయితే ఈ నియామకాలకు సంబంధించి కొంత మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది . 

సగం పోస్టులు పెండింగ్ లోనే . . 

.కోర్టు కేసుల కారణంగా 7 వేల 902 పోస్టుల్లో 4 వేల 638 పెండింగ్ లో ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 3 వేల 264 పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాను వెల్లడించారు . ఆ లాగే స్పోర్ట్స్ , దివ్యాంగుల కోటాకు సంబంధించి 142 పోస్టుల సర్టి ఫికెట్ల పరిశీలన జరుగుతోంది . అలాగే రిజర్వేషన్ కోటాలో ఆర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 382 పోస్టుల ఖాళీగా ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఎన్టీ తెలుగు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 5 , 6 తేదీల్లో సర్టిఫికెట్ల ఆలోడింగ్ ప్రక్రి య జరిగింది . అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల కమిటీల ఆధ్వ ర్యంలో జరుగుతోంది . ఇదిలా ఉండగా . . హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో పెండింగ్ లో ఉన్న 2 వేల 865 పోస్టులకు లైన్ క్లియరైనట్లయింది . ఈ పోస్టుల భర్తీని పది రోజుల్లో పూర్తి చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి డా , ఆదిమూలపు సురేష్ ప్రకటించారు . మిగిలిన పెండింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలోనూ ప్ర భుత్వం తరఫున కౌంటర్లు వేసి , లీగల్ ఒపీనియన్లు తీసుకుని త్వరలో భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు . దీంతో జిల్లాల వారీగా అధికారులు అర్హులైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా జాబితాలు సిద్ధం చేస్తున్నారు . అర్హులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To start posting for eligible candidates in DSC-2018"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0