Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What's the difference between nPR and NCR? How is the census done? Full details

NPR , NCRకి తేడా ఏంటి ? జనగణన ఎలా చేస్తారు ? పూర్తి వివరాలు.

NPR ప్రక్రియ 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది . ఇందులో ప్రజల డెమోగ్రాఫిక్ పాటు బయోమెట్రిక్ డేటాను కూడా సేకరిస్తారు . జనాభా లెక్కలను మునుపటి లాగానే గ్రామ , జిల్లా , రాష్ట్ర , జాతీయ స్థాయిలో సేకరిస్తారు .

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై దుమారం రేగుతోంది. పలు చోట్ల కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. NPRని తెరపైకి తెచ్చి, అందుకోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది. ఐతే అసోం NRCని చేపట్టిన కేంద్రం.. త్వరలోనే దేశ వ్యాప్తంగా అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. NRC ప్రక్రియలో NPR తొలి అడుగు అని చాలా మంది భావిస్తున్నారు. ఎన్‌పీఆర్ ఆధారంగా ఎన్‌ఆర్‌సీ రూపొందించి.. దేశంలో భారత పౌరసత్వం లేకుండా, అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెళ్లగొడతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో NPRపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం

NPR ( National Population Register)అంటే ఏమిటి?

దేశంలో నివసిస్తున్న వారందరి జాబితానే NPR. ఇది దేశ పౌరుల లెక్క తేల్చే గణన కాదు. దేశంలో అసలు ఎంత మంది నివసిస్తున్నారే లెక్క తేల్చడమే NPR.  ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెళ్ల నుంచి నివసిస్తున్నవారిని,లేదా రాబోయే ఆర్నెళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నవారిని స్థానిక పౌరులుగా గుర్తించి ఇంటి ఇంటికి ఆ వివరాలను సేకరించనున్నారు.  మన దేశంలో గత 6 నెలలుగా నివసిస్తున్న విదేశీయుల వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు. అదే NRCలో  కేవలం భారత పౌరులు మాత్రమే ఉంటారు. అందుకే NPRకి NRCతో సంబంధం లేదు.

పౌరసత్వ చట్టం-1955, పౌరసత్వం  (పౌరుల నమోదు మరియ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు-2003 ఆధారంగా NPRని రూపొందిస్తారు. దేశంలో ఉండే సాధారణ నివాసితులందరూ NPRలో నమోదు చేయించుకోవాలి.

NPR ప్రక్రియ 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఇందులో ప్రజల డెమోగ్రాఫిక్‌తో పాటు బయోమెట్రిక్ డేటాను కూడా సేకరిస్తారు.  జనాభా లెక్కలను మునుపటి లాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. వారి ఆధార్,మొబైల్ నంబర్,పాన్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ కార్డు,పాస్‌పోర్టు వంటి ధ్రువీకరణ వివరాలను సేకరిస్తారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్ వివరాలు ఇవ్వడం,ఇవ్వకపోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ ఈ డేటా బేస్‌ను పర్యవేక్షిస్తుంది.

NRC  (National Register of Citizens)అంటే ఏమిటి?

ఎన్ఆర్‌సీ అనేది అధికారికంగా ధ్రువీకరించిన పౌరసత్వ రిజిస్టర్. ఈ జాబితాలో పేరు నమోదైనవారు మాత్రమే దేశ పౌరులుగా పరిగణించబడుతారు.  ఐతే NRCలోని పేరులేని వారిని వెంటనే విదేశీయులుగా ప్రకటించరు. న్యాయ పోరాటం చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. తమకు అన్యాయం జరిగిందని భావించిన వాళ్లు ఫారిన్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించవచ్చు.  ట్రిబ్యునల్స్‌లో కేసు ఓడిపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే చివరగా సుప్రీంకోర్టులోనూ కేసు వేయవచ్చు. ఇక అసోంలో ఇటీవల NRC పూర్తి చేసినందున.. అక్కడ మళ్లీ జన గణన చేపట్టరు. NRC సందర్భంగా ఇప్పటికే అక్కడి ప్రజల వివరాలన్నింటినీ సేకరించారు.

NPR ఎలా రూపొందిస్తారు?

2010లో NPR కోసం తొలిసారి డేటా సేకరించారు. 2011 జనాభా లెక్కలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టారు. 2010 NPRలో 15 అంశాల వివరాలను సేకరిస్తే.. ఈసారి మాత్రం 21 డేటా పాయింట్లను సేకరించబోతున్నారు. ఇక గతంలో వేర్వేరు డేటా పాయింట్లుగా ఉన్న తండ్రి పేరు, తల్లి పేరు, భాగస్వామి పేరును క్లబ్ చేసి ఒకే అంశంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్తగా 8 డేటా పాయింట్లు అదనంగా చేర్చారన్నమాట.

ప్రజల నుంచి సేకరించే వివరాలు ఇవే:


1. వ్యక్తి పేరు
2. ఇంటి పెద్దతో బంధుత్వం
3. లింగం
4. పుట్టిన తేదీ
5. వివాహం
6.విద్యార్హతలు
7. వృత్తి
8. తండ్రిపేరు/తల్లి పేరు/దాంపత్య భాగస్వామి
9. పుట్టిన స్థలం
10. ప్రస్తుతం నివాస చిరునామా
11. ప్రస్తుత నివాస చిరునామాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు.
12. జాతీయత
13. శాశ్వాత నివాస చిరునామా

కొత్తగా చేర్చినవి:
14. ఆధార్ కార్డ్ నెంబర్ (వాలంటరీ)
15. మొబైల్ నెంబర్
16. తల్లిదండ్రులు పుట్టిన తేదీ, పుట్టిన స్థలం
17. చివరగా నివసించిన చిరునామా
18. పాస్ పోర్ట్
19. ఓటర్ ఐడీ కార్డ్ నెంబరు
20. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)
21. డ్రైవింగ్ లైసెన్స్

ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా NRCని తీసుకోచ్చే ఆలోచన లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీని గురించి పార్లమెంట్‌లో గానీ, కేబినెట్‌లో చర్చ జరగలేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఐతే 2018-19 వార్షిక నివేదికలో మాత్రం దేశవ్యాప్త NRCకి NPRతొలి మెట్టని పేర్కొనడం విశేషం. ఈ నేపథ్యంలో NPRపై చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. NPRపై మరో వివాదముంది. దేశ ప్రజలను లెక్కిస్తామనే సాకుతో, వారి నుంచి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా,  జనాభా కమిషనర్ కొత్త కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్, ఓటర్, పాస్‌పోర్టు వంటి కార్డులన్నింటినీ ఒకే కార్డు కిందకు తెస్తామని చెప్పారు. ఈ క్రమంలో NPR ఉద్దేశం.. ఇదేనా అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.

పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక (NPR) రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ప్రకటించాయి.  ఐతే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. ఇది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What's the difference between nPR and NCR? How is the census done? Full details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0