Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

5 Important things about PAN Card. 

 పాన్ కార్డు ను గురించిన 5 ముఖ్య‌ విష‌యాలు.

5 Important things about PAN Card.  

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌తి ఒక్క‌రికీ కేటాయించే శాశ్వ‌త ఖాతా సంఖ్య‌ను పాన్(ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌రు) అంటారు. అంకెలు, అక్ష‌రాలు క‌ల‌గ‌లిపి ఉండే ప‌ది స్థానాల సంఖ్య ఇది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు, ఆ శాఖ‌కు చెందిన ఏ అధికారితోనైనా జ‌రిపే ఉత్త‌ర ప్ర‌త్యుత్తరాల‌లో పాన్‌ను పేర్కొన‌డం త‌ప్ప‌నిసరి. అయినా స‌రే చాలా మంది పాన్ కార్డు తీసుకోకుండా ఇబ్బందులు ప‌డుతుంటారు. మ‌రికొంత మంది ఎక్క‌డ పాన్ కార్డు నంబ‌రు ఇవ్వాలి, ఎక్క‌డ వ‌ద్దు అనే విష‌యంలో తిక‌మ‌క ప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలో పాన్ కార్డును గురించిన ఐదు ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.


1.పాన్ కార్డు ఎప్పుడు అవ‌స‌రం? 


  •  రూ. 50 వేల పైబ‌డి బ్యాంకు డిపాజిట్ల కోసం
  • బ్యాంకు ఖాతా తెరిచేందుకు 
  • డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెర‌వ‌డానికి 
  • చెక్కులు, డీడీల విష‌యంలో లావాదేవీ రూ. 50 వేల‌ను మించితే 
  • స్థిరాస్తి, వాహ‌నాల కొనుగోలు, అమ్మ‌కాలు జ‌రిపేటప్పుడు
  • హోట‌ళ్లు, విలాసాలు, ప్ర‌యాణ ఖ‌ర్చులు వంటి వాటి కోసం రూ. 25 వేల కంటే న‌గ‌దు చెల్లింపులు చేసే విష‌యంలో ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు

2.ఎవ‌రెవ‌రికి త‌ప్ప‌నిస‌రిగా పాన్ ఉండాలి? 

  • ప్ర‌స్తుతం ఆదాయం ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన వారికి, చెల్లించేవారంద‌రికీ, ఇత‌రుల త‌ర‌పున ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖాలు చేయాల్సిన వారికి 
  •  విధిగా పాన్ నంబ‌రు న‌మోదు చేయాల్సిన లావాదేవీల‌లో కొత్త‌గా ప్ర‌వేశించాల‌నుకునే వారికి.


3.పాన్ కోసం ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేయాలి?

  •  పాన్‌కు సంబంధించిన సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం కోసం, ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యం ఉన్న ప్ర‌తి ప‌ట్ట‌ణంలో ఐటీ పాన్ సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి యుటిఐ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌(యుటిఐఐఎస్ఎల్‌) సంస్థ‌కు ఆ శాఖ అనుమ‌తించింది. 
  • పెద్ద న‌గ‌రాల‌లో పాన్ ద‌ర‌ఖాస్తుదారుల సౌక‌ర్యాల కోసం, 
  • యుటిఐఐఎస్ఎల్ ఒక‌టి కంటే ఎక్కువ ఐటీ పాన్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. 
  • వీటితో పాటు టిన్ ఫెసిలిటేష‌న్ కేంద్రాలు కూడా ఉంటాయి. 
  • వీట‌న్నింటిలో పాన్ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

4.వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం 

స్కూల్ లీవింగ్ స‌ర్టిఫికెట్‌(టీసీ) ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా గుర్తింపు పొందిన విద్యా సంస్థ‌ల డిగ్రీ మార్కుల జాబితా డిపాజిట‌రీ ఖాతా స్టేట్‌మెంట్ క్రెడిట్‌కార్డు స్టేట్‌మెంట్ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ నీటి బిల్లు(వాట‌ర్ బిల్లు) రేష‌న్ కార్డు ప్రాప‌ర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్‌ పాస్‌పోర్టు ఓట‌రు గుర్తింపు ప‌త్రం డ్రైవింగ్ లెసెన్సు ఎంఎల్ఏ లేదా ఎంపీ లేదా మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ లేదా గెజిడెడ్ ఆఫీస‌ర్ సంత‌కం చేసి ఇచ్చే గుర్తింపు రుజువు.

5.చిరునామా గుర్తింపుకోసం

విద్యుత్ బిల్లు టెలిఫోన్ బిల్లు డిపాజిట‌రీ ఖాతా స్టేట్‌మెంట్ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్‌ రెంట్ రిసిప్ట్‌(అద్దె చెల్లించిన ర‌సీదు) ఎంప్లాయిర్ స‌ర్టిఫికెట్ పాస్‌పోర్టు ఓట‌రు గుర్తింపు ప‌త్రం ప్రాప‌ర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ రేష‌న్ కార్డు ఎంఎల్ఏ లేదా ఎంపీ లేదా మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ లేదా గెజిడెడ్ ఆఫీస‌ర్ సంత‌కం చేసి ఇచ్చే గుర్తింపు రుజువు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "5 Important things about PAN Card. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0