Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi

అమ్మఒడి లబ్ధిదారులు జాగ్రత్త... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్... ?
Ammavadi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం జగన్ నవరత్నాలలోని హామీలను ఒక్కక్కటిగా నెరవేరుస్తూ ఈ నెల 9వ తేదీన అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో అమ్మఒడి నగదును జమ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 43 లక్షల మంది తల్లులకు 6,456 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటికే చాలా మంది అకౌంట్లలోని డబ్బులను తీసుకోగా మరికొంతమంది బ్యాంకు ఖాతాలలోనే డబ్బులను ఉంచుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం

 ప్రస్తుతం అమ్మఒడి లబ్ధిదారులు జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో అమ్మఒడి పథకనికి సంబంధించిన ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఎవరైనా "అమ్మఒడి లబ్ధిదారులకు ఫోన్ చేసి అమ్మఒడి పథకం కింద మీ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నాం దానికి తనిఖీ చేసేందుకు మీకు ఒక ఓటీపీ వస్తుంది అది చెబుతారా" అని ఫోన్ చేస్తే సమధానం చెప్పవద్దని బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను ఎవరితోను షేర్ చేసుకోవద్దనే మెసేజ్ వైరల్ అవుతోంది.
సైబర్ నేరగాళ్లు ఈ మధ్య కాలంలో అమాయకులను టార్గెట్ చేసుకొని ఫోన్ల ద్వారా టార్గెట్ చేసి వారికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఖాతాలలో డబ్బులు జమ చేస్తామంటూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సొమ్ము పోయిన తరువాత బాధితులు బ్యాంకు అధికారుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. చాలా మంది సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్యాంకు ఆధికారులు, సిబ్బంది ఫోన్ ద్వారా వివరాలను అడగరు 

అమ్మఒడి నగదు ఖాతాకు వేస్తున్నామని బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్ లో సేకరించి సొమ్మును కాజేసే అవకాశాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియాలో అమ్మఒడి లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలనే మెసేజ్ ను వైరల్ చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడూ బ్యాంకు ఆధికారులు, సిబ్బంది ఫోన్ ద్వారా వివరాలను సేకరించరని గుర్తు పెట్టుకోవాలి. ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీలు ఎట్టి పరిస్థితులలోను ఇతరులకు చెప్పకూడదు. మీకు బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఎటువంటి అనుమానాలు ఉన్నా తక్షణమే బ్యాంక్ లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవటం మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavadi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0