Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Biometric attendance at Grama secretaries.

సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు.
Biometric attendance at Grama secretaries.

 సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించనున్నారు . సచివా లయాల పరిధిలో పని చేస్తున్న వున్న గ్రామ , వార్డు వలంటీర్ల హాజరును కూడా ఈ పరికరాల ద్వారానే రోజు వారీ నమోదు చేయనున్నారు . సచివాలయ ఉద్యోగులకు మాత్రం రోజుకు నాలుగు దఫాలుగా హాజరు నమోదు చేయనున్నారు . ఉదయం డ్యూటీలో చేరే సమయంలో ఒకసారి , సాయంకాలం డ్యూటీ దిగే సమయంలో రెండో సారి నమోదు చేయనున్నారు . అదే విధంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రెండు సార్లు నమోదు చేయ నున్నారు . వలంటీర్లకు మాత్రం సచివాలయంలో హాజరయినప్పుడు , వెళ్ళేటప్పుడు రెండు దఫాలు నమోదు చేయనున్నారు . ఇప్పటికే వలంటీర్లందరి వేలిముద్రలను సాఫ్ట్వేర్ లో నిక్షిప్తం చేశారు . సచివా లయ ఉద్యోగులకు నాలుగు పర్యాయాలు హాజరు నమోదు చేయడంతో పూర్తి కాలం ప్రజలకు అందు బాటులో వుండేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది .

 రోజు వారీ హాజరు పర్యవేక్షణ ఇలా

 సచివాలయ ఉద్యోగుల హాజరు నమోదును బయోమెట్రిక్ ద్వారా చేయ డమే కాకుండా దాన్ని పర్య వేక్షించడానికి కూడా ఒక యాపను సిద్ధం చేశారంటు న్నారు . సచివాలయాన్ని పర్యవేక్షించే కార్యదర్శుల వద్ద ఈ యాపు అందుబా టులోకి తేనున్నారు . ఉదయం నుంచి ఉద్యోగులు ఎవరెవరు , ఎన్ని గంటలకు హాజ ర మతున్నారనే విషయం ఈ యాప్లో స్కోలింగ్ రూపంలో నిరంతరాయంగా వెల్లడవు తుందని తెలిసింది . అదేవిధంగా జిల్లాస్థాయిలో కూడా ఏ సచివాలయాలో ఏయే ఉద్యోగులు అందు బాటులో వున్నారనే విషయం ఇదే విధమైన స్కోలింగ్ ద్వారా తెలిసేలా యాపు రూపొందించి నట్లు చెబుతున్నారు .

 బయో మెట్రిక్ తోనే సమావేశాల హాజరు కూడా 

సచివాలయ ఉద్యోగులు , వలంటీర్లతో అధి కారులు జరిపే సమావేశాలన్నీ ఇక మీదట బయో మెట్రిక్ నమోదు ద్వారానే నిర్వహించేందుకు యోచిస్తున్నారు . ఒక్కో మండలంలో సరాసరిన కనీసం 250 మంది వలంటీర్లు , 150 మంది సచివాలయ ఉద్యోగులు వుంటారు . మండల స్థాయిలో వీరందరి తోనూ జరిపే సమావేశాల్లో సంతకాల ద్వారా హాజరు తీసుకోవడం సమస్యగా వుంది . మహిళా వలంటీర్ల బదులుగా కుటుంబ సభ్యులు హాజరవు తున్నా గుర్తించలేని పరిస్థితి నెలకొంది . ఈ గందర గోళాన్ని నివారించేందుకు ఇక మీదట ఏ సమా వేశం జరిగినా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే హాజరు తీసుకునే విధంగా ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Biometric attendance at Grama secretaries."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0