Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for bank Customers. Will be doing a good service soon

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.త్వరలో ఒక మంచి సర్వీస్ చేయనుంది బ్యాంకులు తమ కస్టమర్స్‌కి ఇచ్చే సర్వీసుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి
Good news for bank Customers. Will be doing a good service soon

ఒక బ్యాంక్ కస్టమర్, మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు వేసుకునేలా.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్దం చేసింది. అంతేకాదు వేరే బ్యాంక్ ఏటిఎం సెల్ఫ్ డిపాజిట్ మెషీన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఇచ్చిన సలహాలపై దేశంలోని వివిధ బ్యాంకులు సమాలోచనలు చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల చెల్లింపులకు సంబంధించిన బాధ్యతలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది.

క్యాష్ డిపాజిట్ ఇంటర్ ఆపరబిలిటీ సేవల వల్ల బ్యాంకులతో పాటు ఖాతాదారులు కూడా చాల ప్రయోజనాలు పొందవచ్చని ఎన్‌సీపీఐ ఆధారాలను చూపుతుంది.
నగదు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఆపరేషన్స్ ద్వారా ఇది సాధ్యమేనంటూ పేర్కొంది. ఈ ప్రతిపాదనకు 14 బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి. ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దాదాపు 30,000 వేల పైచిలుకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్స్‌(ఎటిఎమ్స్)లో ఇంటర్ ఆపరబిలిటీ సర్విసెస్ వెసులుబాటు కల్పించవచ్చని, దీనికి టెక్నికల్ ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవంటూ ఎన్‌పీసీఐ వెల్లడించింది. ఇక ఈ సర్వీసెస్‌కు ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఒక బ్యాంకు కస్టమర్, మరో బ్యాంకుకిగానీ, ఏటీఎంకి గానీ వెళ్లి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే.. రూ. 10,000లోపు అయితే రూ.25, రూ.10,000 దాటితే రూ.50 ఛార్జస్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటీఎంలో నగదు డిపాజిట్ చెయ్యడం వల్ల నకిలీ నోట్లు ప్రభావం ఎక్కువగా సర్కులేట్ అయ్యే అవకాశం ఉంటడంతో చాలా బ్యాంకులు ఈ సర్విసెస్‌పై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఇందుకోసం ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసే దిశలో కూడా ఆలోచనలు చేస్తోన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for bank Customers. Will be doing a good service soon"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0