Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Have partners in school development CM Jagan appeals to parents in Ammavadi early House

ALSO READ:

CHECK YOUR AMMAVADI
  • మేనమామగా అడుగుతున్నా..! వెయ్యి వెనక్కివ్వండి
  • పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములుకండి
  • అమ్మఒడి ప్రారంభ సభలో తల్లితండ్రులకు సిఎం జగన్‌ విజ్ఞప్తి

Have partners in school development  CM Jagan appeals to parents in Ammavadi early House

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
అమ్మఒడి పథకంలో భాగంగా ఇస్తున్న 15వేల రూపాయల మొత్తంలో వెయ్యి రూపాయలను వెనక్కివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగనన్న అమ్మఒడి' పథకాన్ని చిత్తూరు పివికెఎన్‌ క్రీడా మైదానంలో గురువరాం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆ వెయ్యి రూపాయలను పాఠశాల కమిటీకి అందచేయడం ద్వారా అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలని తల్లితండ్రులను కోరారు. 'మేనమామగా అడుగుతున్నా...' అని ఆయన అన్నారు.
పిల్లల మేనమామగా మీకు రూ.15వేలు ఇస్తున్నాను. ఆ మేనమామగానే అడుగుతున్నా, అందులో నుంచి వెయ్యి రూపాయలు తిరిగి ఇవ్వండి. ఇలా వచ్చే డబ్బులను పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు, వాచ్‌మెన్‌ల నియామకానికి ఉపయోగిస్తాం. ఆ మొత్తాన్ని స్కూల్‌ కమిటీలకు ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీరు కూడా ఆ పనుల్లో భాగస్వాములైనట్లు అవుతుంది.' అని ఆయన అన్నారు. పిల్లలను చదివించే పరిస్థితి ప్రతి ఇంటిలో కల్పించాలనే ఉద్దేశంతోనే 'జగన్నన అమ్మఒడి పథకాన్ని' తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 43 లక్షల మంది తల్లుల అకౌంట్లల్లో 15 వేల రూపాయలను సమ చేస్తున్నట్లు చెప్పారు. . ఈ సొమ్మును బ్యాంకులు పాత రుణాలకు జమ చేసుకోకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుందని తెలిపారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారికి నెలరోజులు సమయం ఉందని, ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకుంటే వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు.తమ మ్యానిఫెస్టోలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మాత్రమే అమ్మఒడిని ఇస్తామని ప్రకటించామని, అయితే ఇంటర్‌ వరకు దీన్ని కొనసాగించామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. క్రమంగా దీన్ని ఒక్కో తరగతికి పెంచుకుంటూ పోతామన్నారు. నాలుగేళ్ల తరువాత పదో తరగతి బోర్డు పరీక్షలు ఇంగ్లీషులో రాసే విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీని కోసం బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెడతామన్నారు. గవర్నమెంటు బడుల్లో సిలబస్‌ కూడా మార్చుతామని తెలిపారు.

21 నుంచి నూతన మెనూ

జనవరి 21 నుంచి విద్యార్థులకు కొత్త మెనూ అమలు చేస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో రకం వంటతో మెనూ అమలవుతుందన్నారు. ప్రభుత్వానికి రూ.200 కోట్ల భారం పడుతుందని చెప్పారు. అలాగే వంటమ్మలకు రూ. వెయ్యి నుంచి రూ.3వేలకు వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు. బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఇంటర్‌ తరువాత 23 శాతం మంది విద్యార్థులు మాత్రమే పై చదువులకు వెళుతున్నారని, ఈ పరిస్థితి మార్చుతామన్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థుల భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామని,రెండు దఫాలుగా తల్లుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. ఈ సభలో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి, చంద్రగిరి, చిత్తూరు ఎమ్మెల్యేలు ఆర్‌కె రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎ.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Have partners in school development CM Jagan appeals to parents in Ammavadi early House"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0