Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income tax relief is likely

ఆదాయపు పన్ను ఉపశమనానికి అవకాశాలివి..!
Income tax relief is likely

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం జీడీపీ వృద్ధిరేటును ముందుకు నెట్టాలంటే డిమాండ్‌ను పెంచాల్సిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను మినహాయింపుపై మధ్యతరగతి జీవి ఎన్నో ఆశలు పెట్టుకొన్నాడు.

కానీ, పన్ను ఆదాయం తగ్గిన సమయంలో మళ్లీ ఆదాయపు పన్ను ఉపశమనం ప్రకటిస్తుందా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి పన్ను ఉపశమనం ప్రకటించడం సాహసమే అవుతుంది.. ప్రభుత్వం ఈ సాహసం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం.

 ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేయవచ్చు. చట్టంలోని 80సీ పరిధిని పెంచవచ్చు.
గృహరుణాల వడ్డీపై మినహాయింపును పెంచే అవకాశాలు దండిగా ఉన్నాయి.
ఇది రెండువైపులా ప్రయోజనాలు ఉన్న నిర్ణయంగా నిలుస్తుంది. ఇది కొనుగోళ్లను పెంచి గృహనిర్మాణ రంగంలో, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మంచి ఊపును ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రజల వద్ద నగదు మిగులు కూడా పెరుగుతుంది.
ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపుల పెంపుతో ఏర్పడ్డ లోటును ప్రభుత్వం పరోక్ష పన్నుల పెంపుతో తీర్చుకోవచ్చు. జీఎస్టీ స్లాబుల్లో స్వల్ప మార్పులతో దీనిని పూరించుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చే మినహాయింపుల మొత్తం జీఎస్‌టీ రూపంలో వాపస్‌ వస్తుంది.
ప్రభుత్వ ఆదాయపు పన్ను ఉపశమననాలు పెద్దగా కల్పించకపోవచ్చు.. అన్న వాదన కూడా బలంగానే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6.6లక్షల కోట్లను ఆదాయపన్ను రూపంలో, రూ.13.35లక్షల కోట్లను జీఎస్‌టీ రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. కానీ, రెవెన్యూ లక్ష్యాలు రెండూ గాడితప్పాయి. మరోపక్క కార్పొరేట్‌ పన్నురేట్లను తగ్గించి 15శాతం, 22శాతంగా నిర్ణయించాయి. దీంతో రూ.1.45లక్షల కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి మరోసారి ప్రభుత్వ ఆదాయంలో కోత విధించడానికి సిద్ధపడకపోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income tax relief is likely"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0