Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mid day meal The generosity of faculty

మధ్యాహ్న భోజనం.. అధ్యాపకుల ఔదార్యం
Mid day meal The generosity of faculty

స్వచ్ఛందంగా రూ. 1.5 లక్షల వితరణ
విద్యార్థుల ఆకలి తీరుస్తున్న వైనం
మెరుగైన ఫలితాలకు ప్రత్యేక తరగతులు


న్యూస్‌టుడే, వనపర్తి పట్టణం
వార్షిక పరీక్షల నేపథ్యంలో కళాశాలలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్న అధ్యాపకులు
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల ప్రయోజనం కోసం అధ్యాపకులు సొంత డబ్బుతో మధ్యాహ్న భోజన ఏర్పాటుకు ముందుకొచ్చారు. కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల ప్రయోజనం కోసం వృత్తి విద్యా అధ్యాపకులు సొంతంగా డబ్బు వెచ్చించి విద్యార్థుల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారు.
రూ. 1.5 లక్షల వ్యయానికి అధ్యాపకులు ముందుకువచ్చారు. దీంతో గ్రామీణ విద్యార్థులకు ఊరట లభించి చదువుపై దృష్టి సారించనున్నారు. హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం పెరగనుంది. కళాశాలలో శుక్రవారం డీఐఈవో సింహయ్య మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాలలో చదివే 600 విద్యార్థులకు మధ్యాహ్నం ఆకలిబాధ తీరనుంది.

వార్షిక పరీక్షలే లక్ష్యంగా..

ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు రోజూ తమ ఇళ్ల వద్దకు వెళ్లి భోజనం చేసి రావడానికి సమయం సరిపోవడం లేదు. ఇంటికెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం నిర్వహించే తరగతులకు సమయానికి హాజరు కాలేక వెనుకబడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయకుండానే సాయంత్రం ఇంటికెళ్లే వరకు ఉపవాసం ఉంటున్నట్లు అధ్యాపకులు గుర్తించారు. కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందికి ఒక పూట భోజనానికి సుమారు రూ.1.5 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనావేసి ఆ డబ్బులు సమకూర్చేందుకు వృత్తి విద్యా కోర్సుల అధ్యాపకులు చొరవ చూపారు. వార్షిక పరీక్షల వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అధ్యాపకులు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. నిత్యం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా అధ్యాపకులు పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిసేదాకా మధ్యాహ్న భోజనాన్ని వర్తింపజేస్తోమని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్న దృశ్యం

అదృష్టంగా భావిస్తున్నాం.. - బాలమణి, వృత్తి విద్యా కోర్సు విద్యార్థిని

కళాశాలలో మధ్యాహ్నం భోజన వసతికి అధ్యాపకులు పూనుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మా ఆకలిని తీర్చడంతోపాటు ప్రత్యేక తరగతుల నిర్వహణతో వార్షిక పరీక్షల్లో అత్యుత్తుమ ఫలితాలను సాధించేందుకు చొరవ చూపుతుండటంతో మాలోను పట్టుదల పెరిగింది.

హాజరు, ఉత్తీర్ణత పెరుగుతుంది - అనురాధ, అధ్యాపకురాలు

మధ్యాహ్న భోజన వసతితో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ప్రయోజనం చేకూరింది. కళాశాలలోనే విద్యార్థులకు భోజన వసతి సమకూరడంతో వారిలో హాజరు శాతం, అత్యుత్తమ ఫలితాల సాధనలోనూ దోహదపడుతుంది.

చక్కని ఆలోచన - మద్దిలేటి, కళాశాల ప్రధానాచార్యులు

కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన. ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థుల్లోనూ మంచి మార్పు వస్తోంది. వార్షిక పరీక్షల్లో విజయమే లక్ష్యంగా విద్యాభ్యాసం కొనసాగే అవకాశముంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mid day meal The generosity of faculty"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0