Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New benefits with postal savings plans!

తపాలా పొదుపు పథకాలతో సరికొత్త ప్రయోజనాలు !
New benefits with postal savings plans!


కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీం ( ఎస్ఎస్ఏ ) సహా పోస్టాఫీలో వివిధ సేవింగ్ స్కీంలు కలిగి ఉన్న వారికి ఓ మంచి విషయం . సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీమ్స్ ను పోస్టాఫీస్లో కడుతున్నవారు ఎంతో సంతోషించే వార్తను అందించింది పోస్టల్ డిపార్టుమెంట్ . తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్ కు సంబంధించి కొన్ని నిబంధనలు మార్చింది . 

ప్రయోజనకరం . . . 

ఈ కొత్త నిబంధనలతో సుకన్య సమృద్ధి అకౌంట్ కలిగి ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుంది . పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ కలిగి ఉన్నవారికీ లాభం చేకూరుతుంది . కొత్త నిబంధనతో నాన్ హోమ్ పోస్టాఫీస్ బ్రాంచీకి వెళ్లి చెకుక్ ద్వారా డబ్బును చెల్లించవచ్చు . రూ . 25 , 000కు పైన విలువైన చెక్కులను ఇతర పోస్టాఫీస్ బాంచీలకు వెళ్లి కూడా పాజిట్ చేసే వెసులుబాటును కల్పించింది . 

ఏ బ్రాంచీకైనా వెళ్లి డిపాజిట్ చేయవచ్చు . 

ఇప్పటివరకూ రూ . 25 , 000కు పైన విలువైన చెక్కులను హోమ్ బ్రాంచీ కాకుండా ఇతర పోస్టాఫీస్ బాంచీలకు వెళ్లి డిపాజిట్ చేసే సౌకర్యం లేదు . విత్ డ్రా వేసుకోవాలని భావిస్తే రూ . 25 , 000 వరకూ చేసుకోవచ్చు . ఇప్పుడు దీనిని సవరించింది . దీంతో పోస్టాఫీస్లో సేవింగ్ స్కీమ్స్ కలిగిన వారికి ఇది ఎంతో ప్రయోజనకరం . సుకన్య సమృద్ధి యోజన , రికరింగ్ డిపాజిట్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇతర బ్రాంచీల్లోనూ అకౌంట్ చెకుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేయవచ్చు . ఇప్పుడు ఏ బ్రాంచీకి వెళ్లినా డిపాజిట్ చేయవచ్చు . 

ఆన్లైన్ ద్వారానూ . . . .

 సుకన్య సమృద్ధి యోజన , ఆర్జీ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఆన్లైన్ ద్వారానూ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు . ఎస్ఎస్ఏలో దాచుకున్న డబ్బును ఆడపిల్ల 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా ఉన్నత చదువుల కోసం లేదా పెళ్లి కోసం సగం తీసుకోవచ్చు . మిగతా మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాత తీసుకోవాలి . ఆన్లైన్ ద్వారా డబ్బు డిపాజిట్ చేయవచ్చు . ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New benefits with postal savings plans!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0