Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Notification for Secretariat Jobs on 10.01.2020

  • సచివాలయ ఉద్యోగాలకు 10.01.2020 న నోటిఫికేషన్..
  • ప్రస్తుత ఖాళీలు 15,971 పోస్టులు..
  • మరో 3 వేలకు పైగా పోస్టులు పెరిగే అవకాశం..
  • పాత పద్ధతి, మార్గదర్శకాలే వర్తింపు.. 
  • పంచాయతీ రాజ్ శాఖ ద్వారా భర్తీ ప్రక్రియ..


 గ్రామ , వార్డు సచివాలయాలకు  సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం  నోటిఫికేషన్ విడుదల కానుంది . పాత పద్ధతి , మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు . గ్రామ , వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా , వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది . వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు ఆధికార వర్గాలు వెల్లడించాయి . గ్రామ ఉద్యాన ఆసిస్టెంట్ పోస్టులు 1,746 , విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234 , పంచాయతీ డిజిటల్ ఆసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం . గత ఏడాది ఆగస్ట్ - సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులుభర్తీ కాకుండా మిగిలిపోగా , ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు . 

3 వేలకు పైగా పోస్టులు అదనం

 రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏ ర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు . దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు . నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపి నా . . వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Notification for Secretariat Jobs on 10.01.2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0