Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

One Nation. . . One ration. . . All over the country Rs. 3 ration rice.

వన్ నేషన్ . . . వన్ రేషన్ . . . ఇక దేశమంతా కేజీ రూ . 3కే రేషన్ బియ్యం.
One Nation. . . One ration. . . All over the country Rs. 3  ration rice.

టెక్నాలజీని బాగా వాడేసుకుంటున్న కేంద ప్రభుత్వం తాజాగా . . . ఒకే దేశం - ఒకే రేషన్ కార్డ్ విధానం తెచ్చింది . దీని ఉపయోగమేంటో తెలుసుకుందాం .


ఇప్పటివరకూ దేశంలో సబ్సిడీ బియ్యాన్ని ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరకు ఇస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం... ఒకే దేశం - ఒకే కార్డు విధానం తెచ్చింది. దీని వల్ల రేషన్ కార్డు ద్వారా బియ్యం పొందేవారు... దేశంలో ఎక్కడైనా కేజీ రూ.3కే బియ్యం పొందవచ్చు. ఐతే... దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు... నేషనల్ రేషన్ పోర్టబులిటీని తెచ్చింది కేంద్రం. దీని ద్వారా... ప్రజలు... ఏ రాష్ట్రంవారు ఏ రాష్ట్రానికి వెళ్లినా... రేషన్ బియ్యాన్ని మాత్రం రూ.3కే పొందగలరు. నిజానికి ఇదో పైలట్ ప్రాజెక్టు ముందుగా ఏపీ, తెలంగాణలో రేషన్ పోర్టబిలిటీని ప్రారంభించారు. అక్కడ సక్సెస్ అవ్వడంతో... జనవరి 1 నుంచీ కర్ణాటక, ఝార్ఖండ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గోవా, త్రిపురలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ప్రజలు... ఏ రాష్ట్రం నుంచీ ఏ రాష్ట్రానికి వెళ్లినా... రేషన్ బియ్యం మాత్రం కేజీ రూ.3కే కొనుక్కోగలరు. త్వరలో మిగతా రాష్ట్రాలకూ ఈ సేవలు విస్తరించనున్నాయి.

ఇప్పుడు రేషన్ లబ్దిదారుల డేటాను కేంద్రం... ఈ-పాస్ సిస్టంకి అనుసంధానం చేసింది. దీంతో... పై రాష్ట్రాల్లో లబ్దిదారుల డేటా మొత్తం... అన్ని రాష్ట్రాల్లో ఉంటోంది. అందువల్ల సమస్యే లేదు. ఇక్కడ మరో అంశం ఏంటంటే... ఏపీ, తెలంగాణలో రేషన్ బియ్యాన్ని కేజీ రూ.1కే ఇస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో లబ్దిదారు అదనంగా చెల్లించాల్సిన రూ.2ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది రేషన్ బియ్యం తీసుకుంటే... అంతమంది తరపునా ప్రభుత్వాలు రెండేసి రూపాయల చొప్పున చెల్లిస్తూ... ఆ భారాన్ని భరిస్తున్నాయి. ఐతే... తెలంగాణ ప్రభుత్వం స్టేట్ రేషన్ పోర్టబులిటీ తెచ్చింది. తద్వారా లబ్దిదారు ఏ జిల్లా నుంచీ ఏ జిల్లాకి వెళ్లినా రేషన్ పొందగలరు. ఇదే ఫార్ములాను ఆదర్శంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నేషనల్ రేషన పోర్టబులిటీ తేవడం విశేషం. ఇది తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకోతగ్గ అంశం అనుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "One Nation. . . One ration. . . All over the country Rs. 3 ration rice."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0