Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reserve Bank of India RBI to facilitate accounting decision when credit and debit cards do not work  Decided

డెబిట్, క్రెడిట్ కార్డుల స్విచ్చాఫ్..!..
వినియోగదారుల చేతుల్లో నియంత్రణ.
మార్చి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు.
Reserve Bank of India RBI to facilitate accounting decision when credit and debit cards do not work  Decided



క్రెడిట్ , డెబిట్ కార్డులు పనిచేయాల్సిందీ లేనిదీ ఖాతాదారే నిర్ణయించుకునే సౌలభ్యాన్ని కలుగ చేయాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) నిర్ణయించింది . ఇందుకోసం దేశంలోని అన్ని బ్యాంకులకు ఆర్ బిఐ ఆదేశాలు జారీ చేసింది . ఈ విధానం అన్ని సాధారణ , ఆన్లైన్ , జాతీయ , అంతర్జాతీయ కార్డులకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది . వినియోగదారుల భద్రత , సౌలభ్యాన్ని దష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు పేర్కొంది . డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డుల్లో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలను దష్టిలో ఉంచుకొని . . అక్రమాలకు తెర వేయాలనే లక్ష్యంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది . ఆర్‌బిఐ బధవారం జారీ చేసిన నిబంధనల ప్రకారం . . క్రెడిట్ , డెబిట్ కార్డులను ఎటిఎం , ఫోన్ పరికరాలతో మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది . అదే విధంగా ఈ కార్డులను అంతర్జాతీయంగా , దేశీయంగా ఎలా . . ఎక్కడ ఉపయోగించుకోవాలో . . నియంత్రించుకోవాలనే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది . దేశంలో ఎటిఎం , పాయింట్ ఆఫ్ సేల్ ( పిఒఎస్ ) లాంటి కాంటాక్ట్ - బేస్డ్ యూజ్ పాయింట్ల వద్ద మాత్రమే అన్ని కార్డులు ఉపయోగించవచ్చు . అయితే ఏ వ్యక్తి అయినా ఆన్లైన్ లావాదేవీలు , అంతర్జాతీయ లావాదేవీలు , కాంటాక్ట్ లెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే , ఈ సేవలకు వారి కార్డు నిలిపివేస్తారు . తిరిగి ఈ సేవలను పొందటానికి వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి . ఇప్పటికే ఉన్న కార్డ్ వినియోగ దారుల కోసం దేశీయ , అంతర్జాతీయ లావాదేవీలు , ఆన్ లైన్ , కాంటాక్ట్ లెస్ లావాదేవీల కోసం కార్డును నిలిపివేయాలా వద్దా అనే విషయాన్ని బ్యాంకులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది . ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్ బిఐ తెలిపింది . కాగా ప్రీ పెయిడ్ గిఫ్ట్ కార్డులు , స్మార్ట్ కార్డులకు , ఢిల్లీ మెట్రో , ముబయి మెట్రో , బెంగళూరు మెట్రో లాంటి జాతీయ రవాణాలో ఉపయోగించే కార్డులకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది . దేశంలో కార్డుల ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య ప్రతీ ఏడాది అనేక రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్ బిఐ ఈ నిర్ణయం తీసుకుంది . అంతేకాకుండా కార్డు ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య పరిమితిని కూడా ఇకపై వినియోగదారు నిర్ణయించవచ్చు . మొబైల్ యాప్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ , ఎటిఎం , ఐవిఆర్ విధానాల ద్వారా ఈ మార్పు చేసుకునే అవకాశం ఉంది . అదే విధంగా బ్యాంకు శాఖలు , కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది . ఈ కొత్త నిబంధనలు 2020 మార్చి 16 నుండి అమల్లోకి వస్తాయని ఆర్ బిఐ స్పష్టం చేసింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reserve Bank of India RBI to facilitate accounting decision when credit and debit cards do not work  Decided"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0