Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Jobs: 7870 jobs in SBI with degree qualification. . . This is the exam syllabus.

SBI Jobs : డిగ్రీ అర్హతతో ఎస్ బీఐలో 7870 ఉద్యోగాలు . . . ఎగ్జామ్ సిలబస్ ఇదే.
SBI Jobs: 7870 jobs in SBI with degree qualification. . . This is the exam syllabus.


  • 1 . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - SBI దేశ వ్యా ప్తంగా 7870 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే . హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టులున్నాయి .
  • 2 . ఎస్బీఐలో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జనవరి 2న విడుదలైంది . ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది . దరఖాస్తుకు జనవరి 26 చివరి తేదీ . డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు . 
  • 3 . ప్రిలిమినరీ , మెయిన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఎస్ బీఐ . 2020 ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రిలిమినరీ , 2020 ఏప్రిల్ 19న మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది . జూన్ లోగా నియామక ప్రక్రియ పూర్తవుతుంది . ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఎంపిక కావాలంటే మూడు దశల్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది .
  • 4 . మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ , తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది . ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ , టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది . మరి ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్షలకు సిలబస్ , ఏఏ టాపిక్స్ ఉంటాయో తెలుసుకోండి .
  • ' 5 . ఎస్ బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది . 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి . పరీక్ష సమయం 60 నిమిషాలు . 3 సెక్షన్లకు 20 నిమిషాల చొప్పున కేటాయిస్తారు . ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 ప్రశ్నలకు 30 మార్కులు . న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు . రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు .
  • 6 . ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది . తప్పుగా రాసిన ప్రతీ సమాధానానికి 0 . 25 మార్కుల్ని తగ్గిస్తారు . ఉన్న పోస్టుల కంటే 10 రెట్లు అంటే సుమారు 78 , 700 మందిని మెయిన్స్ ఎగ్జామ్ కు షార్ట్ లిస్ట్ చేస్తారు .
  • 7 . ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది . 190 ప్రశ్నలకు 200 మార్కులు . పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు . జనరల్ | ఫైనాన్స్ అవేర్‌నెస్లో 50 ప్రశ్నలకు 50 మార్కులు . జనరల్ ఇంగ్లీష్ లో 40 ప్రశ్నలకు 40 మార్కులు . క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు 
  • 8 . రీజనింగ్ ఎబిలిటీ , కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 50 ప్రశ్నలకు 60 మార్కులు . జనరల్ / ఫైనాన్స్ అవేర్‌నెస్ , జనరల్ ఇంగ్లీషు 35 నిమిషాల చొప్పున , క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ ఎబిలిటీ , కంప్యూటర్ యాప్టిట్యూడు 45 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు .
  • 9 . జనరల్ ఇంగ్లిష్ మినహాయించి అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్ , హిందీలో ఉంటాయి . 1 / 4 నెగిటీవ్ మార్క్ ఉంటుంది . మెయిన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినవారిన ఫైనల్ సెలక్షన్‌కు ఎంపిక చేస్తారు . వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ , టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Jobs: 7870 jobs in SBI with degree qualification. . . This is the exam syllabus."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0