The good news .. TV bill to fall, Like new tariff ..
శుభవార్త.. టీవీ బిల్లు తగ్గుతుంది, కొత్త టారిఫ్ ఇలా..
టీవీ బిల్లులు పెరుగడం జనం చానళ్లు తగ్గించుకుంటున్నారు. ఇది కూడా ఒకందుకు మేలే అంటూ ఫోన్లపై పడిపోతున్నాడు. వ్యాపారం తగ్గితే అసలుకే చేటు కదా. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు పడిపోతాయి. అందుకే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) రంగంలోకి దిగింది. టీవీ వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చింది.
ఇకపై రూ.130కే ఫ్రీ టూ ఎయిర్ చానెల్స్ ఇవ్వాలని ట్రాయ్ టెలికం కంపెనీలను ఆదేశించింది. ఈ రూ.130కి జీఎస్టీ అదనం. బొకే చానెల్స్‌లో ఒక చానెల్ ఖరీదు రూ.12కు మించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దీని ధర రూ.19. ప్రస్తుతం రూ.130 ప్లస్ జీఎస్టీ కలుపుకుని రూ. 150 కింద 100 చానళ్లు మాత్రమే ఉచితంగా వస్తున్నాయి.
ట్రాయ్ సవరించిన టారిఫ్‌ల ఫలితంగా టీవీ బిల్లు 14 శాతం తగ్గే అవకాశముంది. ఇకపై రూ. 150కి 200 ఫ్రీ చానళ్లు వస్త్తాయి. రూ.160 చెల్లిస్తే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ వస్తాయి. అలాగే ఒక ఇంట్లో ఒకటికంటే ఎక్కువ టీవీలు ఉంటే బిల్లులో 40 శాతం మాత్రమే అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. గత ఏడాదిలో ట్రాయ్ సవరించిన టారిఫ్‌లు భారీగానే కాకుండా గందరగోళంగానూ ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
0 Response to "The good news .. TV bill to fall, Like new tariff .."
Post a Comment