Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government will cut EPF ... how much does your salary increase?

ఈపీఎఫ్ తగ్గించనున్న ప్రభుత్వం... దీంతో మీ శాలరీ ఎంత పెరుగుతుందో ?
The government will cut EPF ... how much does your salary increase?

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (ఈపీఎఫ్ఓ) కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అమలు కాబోతున్నాయి. దీని ప్రభావం ఉద్యోగులందరిపైనా పడబోతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న ఇండియన్ ఎకానమీ ని మళ్ళీ పట్టాలెక్కించేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వినియోగం పెరగాలంటే పౌరుల వద్ద లిక్విడిటీ (నగదు) ఉండాలి. ఇందుకోసం ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్న ప్రభుత్వం ... తాజాగా ఈపీఎఫ్ పై కన్నేసింది. కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2019 ని అమలు చేసేందుకు గాను సోషల్ సెక్యూరిటీ బిల్లును ప్రతిపాదిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే... ప్రస్తుత ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కొంత తగ్గించటం వల్ల ఉద్యోగుల చేతికి ఎక్కువ మొత్తం శాలరీ అందేలా చేయాలని తలపిస్తోంది.
ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్దకు ఈ బిల్లు చేరింది. త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదం పొందితే ఉద్యోగుల వేతనాల నుంచి తప్పనిసరిగా మినహించే ఈపీఎఫ్ వాటా తగ్గుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం

2% తగ్గనున్న ఈపీఎఫ్ ....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ... వారి బేసిక్ శాలరీ (మూల వేతనం) లో 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు. సరిగ్గా అంతే మొత్తం (12%) ఎంప్లాయర్ (కంపెనీ/సంస్థ) కాంట్రిబ్యూషన్ గా ఉంటోంది. అయితే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లో నుంచి ఈపీఎఫ్ తో పాటు గ్రాట్యుటీ సహా ఇతర ఖాతాలకు కొంత మొత్తం జమ చేస్తారు. అయితే, ప్రభుత్వం తాజాగా ఈ వాటాను 2% మేరకు తగ్గించి ఈపీఎఫ్ ను కేవలం 10% నికి పరిమితం చేయబోతోంది. ఇది అటు ఉద్యోగికి, ఇటు ఉద్యోగం ఇచ్చే సంస్థకు కూడా వర్తిస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఎంప్లాయిస్ వాటా 10%, ఎంప్లాయర్ వాటా 10% మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

4% పెరగనున్న వేతనాలు...

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ఇకపై ఎంప్లాయిస్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 10% నికి పరిమితం అయితే... ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఆ మేరకు పెరగబోతోంది. ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ నుంచి 2%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ నుంచి 2% మేరకు వేతనంలో కటింగ్ తగ్గుతుంది కాబట్టి... ప్రతి ఉద్యోగికి 4% వేతనం పెరుగుతుంది. అంటే సుమారు రూ 25,000 మూల వేతనం ఉన్న ఒక ఉద్యోగికి నెలకు సుమారు రూ 1,000 వేతనం అదనంగా లభిస్తుంది. ఆ మొత్తాన్ని ఉద్యోగి తనకు నచ్చినట్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పెరిగే వేతనానికి అనుగుణంగా కంపెనీలు తమ సీటీసీ (కాస్ట్ టు కంపెనీ) పాలసీ ని మార్చు కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీలు కొంత అధిక వేతనాలు చెల్లించాల్సి వచ్చే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు
పెంచుకోవచ్చు...

కావాలంటే పెంచుకోవచ్చు...

ప్రభుత్వం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను 10% నికి కుదించినా... మీరు కావాలంటే ఎంతైనా దానిని పెంచుకునే అవకాశం కల్పిస్తారు. మీ మూల వేతనం (బేసిక్ శాలరీ) లో 100% వరకు కూడా ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఎంత ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసుకున్నప్పటికీ... మీ ఎంప్లాయర్ (కంపెనీ) మాత్రం కేవలం 10% మాత్రమే కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఎక్కువ పొదుపు చేయాలనుకునే వారు, అధిక మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్ కావాలనుకునే వారికి మాత్రం ఈపీఎఫ్ పెంచుకునే ఆప్షన్ బాగా కలిసి రానుంది.

పన్ను పోటు...

ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించటం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈపీఎఫ్ 4% మేరకు తగ్గినప్పుడు మీకు అదనంగా వచ్చే వేతనం ఆదాయ పన్ను పోటు కు గురవుతుంది. ఎందుకంటే అది 80సి మినహాయింపు పరిధి లోకి రాదు. అదే సమయంలో మీకు రిటైర్మెంట్ సమయంలో వచ్చే ఫండ్ కూడా భారీగా తగ్గిపోతుంది. నెలకు 4% మేరకే తగ్గుతున్నా... అది కంపౌండింగ్ ఇంటరెస్ట్ కోల్పోయి, మీ రిటైర్మెంట్ సమయానికి రావలసిన సొమ్ములో అధిక మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి, ప్రభుత్వం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించినా... మీ వైపు నుంచి దానిని కొంత పెంచుకుంటే మేలని టాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The government will cut EPF ... how much does your salary increase?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0