Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The High Court, which contradicts the Supreme Court ruling in English Medium in Government Schools

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంస్పష్టం చేసిన హైకోర్టు
The High Court, which contradicts the Supreme Court ruling in English Medium in Government Schools

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంగ్లీషు మీడియం బోధించేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జిఒలను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జికె.మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం మరోసారి విచారించింది. ఇంగ్లీషు మీడియం అమల్లో భాగంగా పాఠ్య పుస్తకాలను ముద్రిస్తే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని మరోసారి హెచ్చరించింది.
పుస్తకాల ప్రింటింగ్‌ తదితర అంశాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని, ఈ విషయాన్ని గతంలోనూ చెప్పామని గుర్తు చేసింది. తాము చెప్పిన దానికి విరుద్ధంగా చర్యలుంటే అందుకు అయ్యే ఖర్చుల్ని అధికారులే తమ జేబుల్లోంచి చెల్లించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వ వాదనను తెలియజేస్తూ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఫిబ్రవరి 4న జరిగే తదుపరి విచారణకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యా హక్కు చట్టం కింది ఎనిమిదో తరగతి వరకూ మాతృభాషలో విద్యా బోధన చేయాల్సి ఉందని, ఇదే కేంద్ర ప్రభుత్వ వైఖరని కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కష్ణమోహన్‌ చెప్పారు.

ఇంగ్లీషులో బోధించేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని పిటిషనర్‌ లాయర్‌ ఇంద్రనీల్‌బాబు చెప్పారు. ఈ వాదనలపై ప్రభుత్వం తరఫున ఎజి శ్రీరామ్‌ స్పందిస్తూ.. బలవంతంగా ఇంగ్లీషు మీడియాన్ని బోధించడం లేదని, విద్యార్థులు తెలుగులో చదువుకునేందుకు ఆసక్తి చూపితే ఆ మేరకు విద్యాబోధన చేసేందుకూ ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. విచారణ వచ్చే నెల 4కి వాయిదా పడింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The High Court, which contradicts the Supreme Court ruling in English Medium in Government Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0