Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Union Budget 2020 Highlights

Union Budget 2020 Highlights
కేంద్ర బడ్జెట్-2020 హైలెట్స్
Union Budget 2020 Highlights

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్‌ అని అభివర్ణించారు....

UNION BUDGET 2020 LIVE
  • కేంద్ర బడ్జెట్‌ 2020-21 లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి...
  • చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే. 2వేల కి.మీ. హైవేల నిర్మాణమే లక్ష్యం.
  • బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా  సబర్బన్‌ రైల్వే వ్యవస్థ.
  • రైలు మార్గాల ఇరు పక్కల సోలార్‌ కేంద్రాల ఏర్పాటు.
  • పర్యాటక కేంద్రాలతో తేజస్‌ రైళ్లు.
  • 11వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ.
  • ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు.
  • ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
  • రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్త 5 ఆకర్షణీయ నగరాలు.
  • నైపుణ్య శిక్షణకు రూ.3వేల కోట్లు.
  • యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు.
  • నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌కు రూ.1480కోట్లు. >జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం.
  • చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో బీమా పథకం.
  • సెల్‌ఫోన్లు, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాల ఉత్పత్తి ప్రోత్సాహానికి ఒక నూతన పథకం. ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మారుస్తాం.
  • త్వరలో కొత్త విద్యా విధానం.
  • విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం.
  • నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు.
  • 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు.
  • జిల్లా ఆస్పత్రులతో మెడికల్‌ కాలేజీల అనుసంధానం.
  • విద్యా రంగానికి రూ.99,300కోట్లు
  • భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్‌’
  • బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
  • రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు. పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు. ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు.
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు.
  • పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
  • ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
  • గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
  • ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తులు
  • 16 లక్షలమంది రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌
  • సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
  • మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి. ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు. మూడో ప్రాధాన్యాశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ,రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
  • 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
  • 26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
  • పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
  • ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం చేస్తాం
  • ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన
  • జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
  • రూ లక్ష కోట‍్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు
  • 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
  • జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
  • జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి

త్వరలో కొత్త విద్యా విధానం

త్వరలో కొత్త విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను
ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో విద్యారంగానికి 99300 కోట్లు కేటాయించామన్నారు. పోలీస్‌ ఫోరెస్స్‌, క్రైమ్‌ సైన్స్‌ పేరుతో కోర్సులు ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. ఉన్నత విద్యకు భారత్‌ డెస్టినేషన్‌గా ఉండాలని ఆమె అన్నారు. మరిన్ని జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు ప్రారంభిస్తామని, డిగ్రీ లెవెల్‌లో ఆన్‌లైన్‌ కోర్సుల ప్రోగ్రామ్స్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆమె అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Union Budget 2020 Highlights"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0