Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

5 Types of Effective Remedies for Preventing Knee Pain

మోకాళ్ళ నొప్పులను నివారించే 5 రకాల ఎఫెక్టివ్ రేమిడీస్

మనం ఏ పని చేసినా మన మోకాలిపై భారం పడుతూనే ఉంటుంది . మన శరీరంలోనే ఇది ఒక అద్భుతమైన అవయం . శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం .

రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. అయితే కొందరిలో మోకాలినొప్పి వయసును బట్టి కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా 45 సంవత్సరాలు పై బడిన వారిలో మోకాళ్ల నొప్పులు రావటం సాధారణం.

మోకాళ్ల నొప్పి తగ్గించి.. ఎముకలను బలంగా మార్చే ఆయుర్వేదిక్ రెమిడీస్..!
 అల్లం

అల్లంలో అనాల్జెసి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్లపై అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేయాలి. అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మోకాళ్ల నొప్పుల వారు నొప్పి అధికంగా ఉన్నప్పుడు అల్లం టీలో పసుపు కలిపి తాగితే సరిపోతుంది. అలాగే ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్కను, సగం చెంచా పసుపును వేసి 10-15 నిమిషాలు మరిగించి తేనె కలుపుకుని తాగితే మంచిది. ఇలా వారానికి రెండు సార్లు చేసినా మోకాళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి.
  నిమ్మ

నిమ్మ సిట్రస్‌ యాంటీ-ఇన్ప్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మోకాళ్లొ నొప్పలతో బాధపడేవారు ఎక్కువగా దీన్ని ఉపయోగించడం మంచిది. తినే ఆహారంలో లేదా అప్పుడప్పుడు నిమ్మతో తయారుచేసిన పానీయాలు తాగడం మంచిది. అలాగే నువ్వుల నూనె, నిమ్మ రసం సమభాగాలుగా తీసుకుని వాటిని బాగా కలిపి కీళ్లపై మర్దన చేస్తే మోకాళ్ల నొప్పలు క్రమంగా తగ్గుతాయి.
 పసుపు

పసుపు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మోకాళ్ళ నొప్పులను, ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. పసుపు మిక్స్‌ చేసిన పాలు తాగడం వల్ల మోకాళ్ల నొప్పల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత‌ ప‌సుపును తీసుకుని నీటితో క‌లిపి పేస్ట్‌లా చేయాలి. అనంత‌రం దాన్ని మోకాళ్ల‌పై మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు త‌గ్గుతాయి. ఒక టీస్పూన్ ప‌సుపు, 1 టీస్పూన్ చ‌క్కెర పౌడ‌ర్‌, 1 టీస్పూన్ లైమ్ పౌడ‌ర్‌ల‌ను తీసుకుని వాటిని త‌గినంత నీటితో బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని, చిక్క‌ని పేస్ట్ త‌యార‌వుతుంది. ఈ పేస్ట్‌ను రాత్రి పూట స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా దాన్ని అలాగే వ‌దిలేయాలి. ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే నొప్పులు త‌గ్గిపోతాయి.
 ఆవాల నూనె

ఆవాల నూనెను ప్రతిరోజూ రెండుసార్లు మీ మోకాలు నొప్పి ఉన్న చోట పూస్తే ఉపశమనం పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో వెల్లుల్లి , ఒక లవంగ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగించాలి. ఆ తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్న చోటు పూయాలి. ఇలా తరచూ చేస్తే ఉంటే నొప్పి నుంచి ఉపశమన పొందవచ్చు. ఆ నూనెతో మోకళ్లపై మసాజ్ మాత్రం తరచుగా చేస్తూ ఉండాలి.
 సైడర్ వెనిగార్

యాపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వెనిగర్. రోజు మొత్తంలో ఏ భోజనానికి ముందైనా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే మంచిది. యాపిల్ సైడర్ వెనిగర్ లో అల్కలిన్ లక్షణాలుంటాయి. మోకాలి లోపల హానికరమైన వాటిని తొలగించడంలో ఇది సాయపడుతుంది. రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తాగాలి. వేడి నీటి స్నానపు తొట్టెలో రెండు కప్పులు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఆ తొట్టెలో మోకాలును అరగంట సేపు ఉంచాలి. ఒక స్పూన్ ఆలివ్ నూనె, ఒక స్పూన్ యాపిల్ వెనిగర్ ను మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో మాసాజ్ చేయాలి.
 క్యారెట్

క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వ‌ల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ లో పవర్ ఫుల్ విటమిన్స్, న్యూట్రీషియన్స్, అనేకం ఉన్నాయి. అందువల్ల క్యారట్ జ్యూస్ తాగడం వల్ల మోకాలి నొప్పులు దాదాపుగా తగ్గిపోతాయి. ప్రతిరోజూ క్యారట్ రసం తాగడం లేదా క్యారట్లు తినేడం చేయాలి. క్యారట్ జ్యూస్ లో నిమ్మకాయరసం కలుపుకుని తాగితే మోకాలి నొప్పి తగ్గిపోతుంది. అలాగే కీళ్లు దృఢంగా మారుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "5 Types of Effective Remedies for Preventing Knee Pain"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0