Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

E-attendance is a must for teachers .. Attendance is considered absent if not registered.

ఉపాధ్యాయులకు ఈ-హాజరు తప్పనిసరి..
హాజరు నమోదు చేయకుండా ఉంటే గైర్హాజరు గా భావిస్తారు..
E-attendance is a must for teachers ..  Attendance is considered absent if not registered.

ఈ-హాజరు ఆధారంగా వేతనాలను ఆన్ లైన్  లో మదింపు చేసి బిల్లులను ట్రెజరీకి పంపుతారు.
100 శాతం ఈ-హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ..

 రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇకపై ఈ - హాజరు తప్పమనం కానుంది . ఏప్రిల్ నెల నుంచి ఆన్ లైన్ లోనే హాజరు వివరాలతో వేతనాలు మదింపు చేసి బిల్లులను  బ్రెజరీకి పంపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది . రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఈ - హాజరు విధానాన్ని 2011లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది . 11 , 500 పాఠశాలల్లో ఈ - హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు . 1 . 80 లక్షల మంది ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకుంటున్నాడు . ఈ హాజరు విధానం ప్రారంభించిన తొలినాళ్లలో ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత చోటు చేసుకుంది . బయోమెట్రిక్ యంత్రాలు నాసిరకం కావడం , నెట్వర్క్ సరిగా  పని చేయకపోవడం వంటి కారణాలతో ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించింది . పేరు నమోదుకు 30 నిమిషాల వరకూ పట్టడం , తదితర కారణాల వల్ల ఈ - హాజరుపై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమయింది . వివిధ కార కాల ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఈ - హాజరును తప్పనిసరి చేయలేదు . సమాంతరంగా మాన్యువల్ గా హాజరు వివరాలు నమోదు చేస్తున్నారు . ఇది తప్పనిసరి కాకపోవడంతో కొంతమంది మాత్రమే ఈ హాజరు నమోదు చేస్తు న్నారు . ఈ విధానంలో విధులకు హాజరైన సమయం , వెళ్లిన సమయం కూడా నమోదు అవుతుంది . సెలవులు తదితరాలను పరిగణలోకి తీసుకుని వేతన బిల్లులను మాన్యువల్ గా తయారు చేస్తున్నారు . మాన్యువల్ గా బిల్లుల తయా రిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది . కొన్ని సందర్భాల్లో బిల్లులను ఆమోదింప చేసుకోవడంలో ఉపాధ్యాయులు ఇబ్బం దులు పడుతున్నారు . దీనిపై పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది . ఈ హాజు రును తప్పనిసరి చేయడం ద్వారా కొన్ని అక్రమాలకు తెరదించవచ్చని భావి స్తోంది . ఇందులో భాగంగా ఈ - హాజరును తప్పనిసరి చేస్తూ తాజాగా ఉత్త - ర్వులు జారీ చేసింది . దీంతో ఉపాధ్యాయులు సెలవు పెడితే తప్పనిసరిగా ముందుగా తెలియచేయాల్సి ఉంటుంది . సెలవు పెట్టకుండా , హాజరు నమోదు చేయకుండా ఉంటే విధుల నుంచి గైర్హారుగా భావిస్తారు . విధులకు హాజరైతే - ఈ - హాజరులో నమోదు అవుతుంది . ఇలా ఈ - హాజరు ఆధారంగా వేతనాలను ఆన్లైన్ లో మదింపు చేసి బిల్లులను ట్రెజరీకి పంపుతారు . ట్రెజరీ నుంచి వేత నాలు ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి . ఈ విధానం వల్ల  వేతనాల మదింపులో సిబ్బంది ప్రమేయం ఉండదు . ఉపాధ్యాయులు ఈ - హాజరును 100 శాతం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధి కారులకు ఆ శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "E-attendance is a must for teachers .. Attendance is considered absent if not registered."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0