Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPF Passbook Download

EPF Passbook Download 
EPF Passbook డౌన్లోడ్ చేసే విధానం.
EPF Passbook Download


మీ పీఎఫ్ అకౌంట్ లో ఎన్ని డబ్బులు జమ అయ్యాయో తెలుసుకునేందుకు EPF పాస్ బుక్ డౌన్లోడ్ చేయాలను కుంటున్నారా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి.

ఉపయోగాలు
మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా?

  •  నెలనెలా మీ జీతం నుంచి పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయా?
  •  అసలు ఇప్పటివరకు మీ పీఎఫ్ అకౌంట్‌లో ఎంత జమైంది?
  •  నెలనెలా ఎంత మీ పీఎఫ్ అకౌంట్‌లో యాడ్ అవుతోంది?
  •  ఈ విషయాలన్నీ తెలుసుకో వాలంటే మీరు ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయాలి.
  •  నెలనెలా జీతంలో డబ్బులు కట్ అవుతున్నాయి కదా అని మీరు పట్టించుకోకుండా ఊరుకోవద్దు.
  •  అప్పుడప్పుడు పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసి ఈపీఎఫ్ స్టేట్‌మెంట్ చెక్ చేయాలి.
  •  ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారైతే సెక్షన్ 80సీ కింద ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు ఓ క్లారిటీ కూడా వస్తుంది.
  •  అంతేకాదు... ఇప్పటి వరకు మీ ఎంప్లాయర్ వాటా, మీ వాటా మొత్తం కలిపి ఎంత జమైందో కూడా లెక్క చూసుకోవచ్చు. 
  • ఒకవేళ మీరు గతంలో పనిచేసిన కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి మారితే మీ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ పాస్‌బుక్ ఉపయోగపడుతుంది.
  •  ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో పీఎఫ్ అకౌంట్ నెంబర్, కంపెనీ ఐడీ లాంటి వివరాలుంటాయి. 
  • మరి పీఎఫ్ పాస్‌బుక్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
డౌన్‌లోడ్ చేయు విధానం


  • మీరు ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • ఇందుకోసం https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  •  Important Links కింద ఉండే Activate UAN పైన క్లిక్ చేయండి. 
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ యూఏఎన్, ఆధార్, పాన్ నెంబర్లతో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేయండి. 
  • తర్వాత Get Authorization Pin పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత Validate OTP and activate UAN పైన క్లిక్ చేయండి.
  •  మీ యూఏఎన్ యాక్టివేట్ కాగానే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాస్‌వర్డ్ కూడా ఉంటుంది. 
  • మీరు లాగిన్ అయిన తర్వాత ఆ పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.
  • మీరు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదు.
  •  రిజిస్ట్రేషన్ చేసిన 6 గంటల తర్వాతే పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు. పాస్ బుక్ డౌన్‌లోడ్ చేయడానికి https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login ఓపెన్ చేయండి. 
  • మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. 
  • లాగిన్ తర్వాత మెంబర్ ఐడీ ఎంటర్ చేసి పాస్‌బుక్ చెక్ చేయండి. 
  • పీడీఎఫ్ ఫార్మాట్‌లో సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

  • పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయకుండా ఇంకా సులువుగా  మీ పీఎఫ్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPF Passbook Download"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0