Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For Outsourcing Employees. . . . Withholding of February Wages! • Requirements to be made by Outsourcing Corporation.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు . . . . ఫిబ్రవరి వేతనాల నిలిపివేత !
• ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదేశం.
For Outsourcing Employees. . . . Withholding of February Wages!  • Requirements to be made by Outsourcing Corporation.

 రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వివిధ శాఖల్లో స్వీపర్లు , డ్రైవర్లు , గుమాస్తాలు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు , సెక్యూరిటీ గార్డులు , క్లీనర్లు తదితర ఉద్యోగుల సేవలను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది . ముఖ్యంగా దేవాదాయ , రెవెన్యూ , మున్సిపల్ , పంచాయతీ రాజ్ , రూరల్ డెవలప్మెంట్ , టూరిజం , ఎక్సెజ్ వంటి శాఖల్లో ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అధిక మొత్తంలో పనిచేస్తున్నారు . రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో నాలుగు లక్షలకు పైచిలుకు ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్లు అధికారి క లెక్కలు చెబుతున్నాయి . వీరంతా కూడా ప్రైవే టు ఏజెన్సీల ద్వారా నియమించబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తుండటంతో ప్రభుత్వం ఇచ్చే వేతనాల్లో 20 శాతం మేర ఏజెన్సీ తీసుకుని , మిగిలిన మొత్తాన్ని సంబంధిత ఉద్యోగికి ఇస్తున్నా రు . ఈ దోపిడీని అరికట్టేందుకు గత ఏడాది నవంబర్ 30న ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోడ్ సర్వీసెస్ ( ఏపీసీఓఎస్ ) ద్వారా ఈ నియామకాలు చేపట్టాల ని ఆదేశించారు . ఈ మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏపీసీఓఎస్ ద్వారా నియమించుకోవాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు . అయితే , అప్పటికప్పుడు వీరిని

దెబ్బతింటున్న ప్రభుత్వ లక్ష్యం

 వివిధ శాఖల్లో మొత్తం 4 లక్షల మంది పైచిలుకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తుండగా ఇప్పటి వరకూ కేవలం 27 వేల మం దికి సంబంధించిన శాలరీ ఇండెంట్లు మాత్రమే ప్రభుత్వానికి అందాయి . జనవరి 31 వరకు గడువు ఇచ్చినప్పటికీ సంబంధిత శాఖలు తమ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌కు అఫిలియేట్ చేయకపోవడం , కొత్త వారిని నియ మించుకోవడం కార్యక్రమాలు చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతింటున్నాయి .వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచివేతనాలు ఇస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో వారికి చేరక పోవడం పట్ల ముఖ్య మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ముఖ్య భూమిక పోషించాలని సీఎం ఆకాంక్షించారు . ఇందులో భాగంగానే సిబ్బంది ఎవరైతే గవర్న మెంట్ ఏజెన్సీ కింద వివిధ శాఖల్లో పనిచేస్తు న్నారో వారందరినీ కార్పొరేషను అఫిలియేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు . ఈ మేరకు జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు , అన్ని శాఖల ఉన్నతాధికారులు వారివారి శాఖల్లో అవసరమైన ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను ఆయా శాఖల అధికారిక వెబ్ సైట్లలో పొందుపర్చాలని ఆదేశించారు . మార్చి నెల నుండి ఇకపై ఏ శాఖలోనూ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉద్యోగలు నియమించబడటానికి వీల్లేని ఆయన స్పష్టం చేశారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For Outsourcing Employees. . . . Withholding of February Wages! • Requirements to be made by Outsourcing Corporation."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0