Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Intermediate first year entrances in the AP BC Gurukulam Good news for tenth grade students

Intermediate : ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలు.పదో తరగతి విద్యార్థులకు శుభవార్త. 
Intermediate first year entrances in the AP BC Gurukulam  Good news for tenth grade students

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది.
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్ కాలేజీ(బీసీ గురుకులాలు)ల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయ్యింది. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25తో గడువు ముగియనుంది. ప్రవేశ పరీక్షకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు పూర్తి వివరాల కోసం www.jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు గడువు తేదీ : ఫిబ్రవరి 25, 2020
ప్రవేశ పరీక్ష : మార్చి 8, 2020(ఆదివారం)
ఫలితాలు విడుదల : మార్చి 15, 2020
సీట్ల కేటాయింపు : ఏప్రిల్ 15 నుంచి 17 లోపు..
2080 సీట్లు అందుబాటులో..
బీసీ గురుకుల కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం 2080 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో 14 బీసీ గురుకుల కాలేజీలు ఉండగా, అందులో ఏడు బాలురకు, మరో ఏడు కాలేజీలను బాలికలకు కేటాయించారు. వాటిల్లో బాలురకు 1080 సీట్లు కేటాయించగా, బాలికలకు 1000 సీట్లు ఉన్నాయి. అయితే ఆయా కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.
పరీక్షా విధానం ఇలా..
బీసీ గురుకుల ప్రవేశ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఇస్తారు. ఇందులో పదో తరగతి పాఠ్యాంశాల నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. గణితం నుంచి 20 ప్రశ్నలు, భౌతిక శాస్ర్తం నుంచి 20 ప్రశ్నలు, బయాలజీ నుంచి 20, సోషల్ సైన్స్ నుంచి 15, ఇంగ్లీష్(కాంప్రహెన్షివ్ అండ్ గ్రామర్) నుంచి 15, లాజికల్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించగా, ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నాపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Intermediate first year entrances in the AP BC Gurukulam Good news for tenth grade students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0